- Advertisement -

ఏపీ బీజేపీ చీఫ్‌గా మాజీ సీఎం!

- Advertisement -

దక్షిణాదిపై బీజేపీ మరింత దృష్టి సారించిందా?, ప్రధానంగా తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెంచిందా?,ఆపరేషన్ సౌత్‌ నేపథ్యంలో కాషాయ పార్టీ తీసుకుంటున్న స్టెప్ ఏంటీ?, ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

తెలంగాణలో బలాన్ని పెంచుకున్న బీజేపీ ఇప్పుడు ఏపీపై దృష్టి సారించింది. కూటమి పొత్తులో భాగంగా చెప్పుకొదగ్గ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు గెలిచిన బీజేపీ ఇప్పుడు పార్టీ విస్తరణపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా త్వరలో కొత్త చీఫ్‌ను నియమించాలని భావిస్తోంది. ఏపీ బీజేపీ చీఫ్ రేసులో ప్రధానంగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి సీఎంగా పనిచేశారు కిరణ్ కుమార్ రెడ్డి. గత ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన కిరణ్ కుమార్…రాజంపేట లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన సేవలను ఉపయోగించుకోవాలని చూస్తున్న బీజేపీ త్వరలోనే ఆయనకు ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పాలని భావిస్తోంది.

ఎందుకంటే ప్రస్తుత అధ్యక్షురాలు పురందేశ్వరి పదవీకాలం త్వరలో పూర్తికానుంది.దీనికితోడు ఆమె ఎంపీగా ఉండటం వల్ల ప్రత్యామ్నాయంగా కిరణ్ కుమార్ రెడ్డి పేరును పరిశీలిస్తోంది. దీనిని తోడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది.

ఎందుకంటే ఇప్పటివరకు ఏపీ బీజేపీ అధ్యక్షులుగా పనిచేసిన వారంతా కోస్తా ప్రాంతానికి చెందిన నేతలే. ఈసారి రాయలసీమకు చెందిన నేతకు అది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి అవకాశం ఇవ్వాలని భావించిన బీజేపీ…కిరణ్ పేరును ఫైనల్ చేసిందని టాక్. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన రానుందని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -