- Advertisement -

వీడియో..స్టాలిన్‌ను ఇమిటేట్ చేసిన విజయ్!

- Advertisement -

తమిళనాడు శాసనసభ మంగళవారం ఒక అరుదైన, ఆసక్తికరమైన సన్నివేశానికి వేదికైంది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సభలో ప్రసంగిస్తూ.. ముగింపులో స్పీకర్ అనుమతి తీసుకుని మరీ మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌ను అనుకరిస్తూ ఒక సినీ స్టైల్ హావభావాన్ని ప్రదర్శించారు. దీంతో ట్రెజరీ బెంచీల్లోని ప్రభుత్వ పక్షం సభ్యులంతా చప్పట్లతో సభను హోరెత్తించారు.

అంతకుముందు గత ప్రభుత్వ హయాంలో పార్టీ నిధుల పేరిట జరిగిన వ్యవహారాలపై సీఎం విజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రతిపక్ష డీఎంకే (DMK) ఎమ్మెల్యేలు సభ నుండి వాకౌట్ చేశారు.

గతంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) లేకపోవడంపై ప్రజలు అలసిపోయేలా పదే పదే మాట్లాడారు. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇప్పుడు ఒక పర్మనెంట్ డీజీపీ నియామకం జరిగింది. రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది.. దానికి ఎవరు బాధ్యులు? అప్పుడు పోలీస్ శాఖ ఎవరి నియంత్రణలో ఉంది? దాన్ని ఎందుకు అదుపు చేయలేకపోయారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వారి అంతరాత్మకే తెలుసు అన్నారు విజయ్.

టీవీకే (TVK) పార్టీపై డీఎంకే చేస్తున్న ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలను విజయ్ కొట్టిపారేశారు. సీపీఐ(ఎం) ,ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీలు తమ నిర్ణయాలను స్వతంత్రంగానే తీసుకున్నాయని ఆయన స్పష్టం చేశారు. అలాగే 41 మంది ప్రాణాలు కోల్పోయిన కరూర్ తొక్కిసలాట ఘోరకలి గురించి విజయ్ భావోద్వేగంగా మాట్లాడారు. 41 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ విషాదకర ఘటన నన్ను ఎంతగానో కలచివేసింది. ఆ బాధ నన్ను ఎప్పటికీ వదిలిపెట్టదు. కానీ ఆ నిందను కూడా మాపైనే వేస్తున్నారు. ఇది అత్యంత ఘోరం. రాజకీయాలు మరీ ఇంత క్రూరంగా ఉంటాయా? అని విజయ్ ప్రశ్నించారు.

సభలో ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూనే, చివర్లో స్పీకర్ అనుమతితో విజయ్ చేసిన ఆ విలక్షణమైన మేనరిజం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -