గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ప్రభుత్వం వేసిన సిట్ (SIT) విచారణ నేరస్తులను కాపాడటానికే జరుగుతోంది అని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఈ కేసులో దోషులుగా ఉన్న పోలీసులను తప్పించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు.
ఆధారాలను తుడిచేసే ప్రయత్నం జరుగుతోంది. 9వ తేదీ నుండి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీటీవీ (CCTV) ఫుటేజ్ మాయం అయిపోయిందని వార్తలు వచ్చాయి. దోషులైన పోలీసులను కాపాడేందుకు పోలీసు యంత్రాంగం అంతా సర్వశక్తులు ఉపయోగిస్తోంది. అందుకే ఈ కేసుపై నిజాలు నిగ్గుతేలాలంటే సీబీఐ ఎంక్వైరీ జరగాలి అన్నారు అంబటి రాంబాబు.
న్యాయస్థానాలు వేయాల్సిన శిక్షలు పోలీసులే వేసేస్తారా?” – పవన్ కళ్యాణ్‌పై అంబటి రాంబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. నేరస్తులు ఏ కులం వాడైనా శిక్షించాల్సిందే అని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. అసలు శిక్షించడం అంటే అరెస్టులు చేసి చంపేసి, బూడిద చేసేయడమా? మన దేశంలో న్యాయస్థానాలు వేయాల్సిన శిక్షలను పోలీసులే స్వయంగా వేసేస్తారా? అని ప్రశ్నించారు.
