ఏపీ టీడీపీ తొలి జాబితా రెడీ అయిందా..?సగానికిపైగా సీట్లతో తొలి జాబితాను చంద్రబాబు రెడీ చేశారా..?టీడీపీతో పాటే జనసేన సైతం తొలి లిస్ట్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా తొలి లిస్ట్‌లో దాదాపు 90కి పైగా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు చంద్రబాబు. సంక్రాంతి తర్వాత టీడీపీ జాబితాను రిలీజ్ చేయనుండగా ఇందులో 19 మంది సిట్టింగ్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మరో 71 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక టీడీపీ సిట్టింగ్‌ల్లో రాజమండ్రి సిటీ నుండి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని స్థానంలో ఆమె భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్‌కు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ – జనసేన మధ్య ఫ్రెండ్లీ కంటెస్ట్ ఉన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జనసేన నేత కందుల దుర్గేష్ కోసం పవన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం తన మాటను నెగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక టీడీపీ – జనసేన కూటమిలో బీజేపీ చేరే అవకాశం ఉండటంతో ఆ స్థానాలను వదిలేసి అభ్యర్థులను ప్రకటించనున్నారు. అయితే టీడీపీ లిస్ట్ తర్వాత అసంతృప్తులను బుజ్జగించడం బాబుకు కత్తిమీద సామేనని అంతా అభిప్రాయపడుతున్నారు.