Saturday, May 10, 2025
- Advertisement -

వైసీపీ బలంగా ఉన్న చోట్ల..ఆ పార్టీ పోటీనా!

- Advertisement -

వినడానికి వింతగా ఉన్న వైసీపీ బలంగా ఉన్న రెండు చోట్ల టీడీపీ,జనసేన,బీజేపీ తెగ పోటీ పడుతున్నాయి. ఇంతకీ ఆ నియోజకవర్గాలు ఏంటనకుంటున్నారా?,అవే సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని రాజంపేట, జమ్మలమడుగు. ఈ రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేసేందుకు కూటమి పొత్తులో భాగంగా మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇప్పుడు ఇదే జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారగా మరికొంత మంది మాత్రం నవ్వుకుంటున్నారు.

వాస్తవానికి జగన్ సొంత జిల్లాలో పోటీచేయాలంటే ప్రత్యర్థి పార్టీలకు అభ్యర్థులే దొరకని పరిస్థితి. అలాంటిది ఈ జిల్లాలో వైసీపీ బలంగా ఉన్న రెండు స్థానాల కోసం పోటీ జరుగుతుండటం విశేషం. ఇక జనసేన రాజం పేట కోసం పట్టుబడుతుండగా జమ్మలమడుగు టికెట్ కోసం బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇదే తెలుగు తమ్ముళ్ల చేత ఆగ్రహం తెప్పిస్తోంది.

ఎందుకంటే టీడీపీతో పోలిస్తే జనసేన,బీజేపీ ఓటు బ్యాంకు తక్కువే. కానీ తమకే సీటు కావాలని అడుగుతుండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. జగన్ సొంత జిల్లాలో గెలుపు సంగతి పక్కనపెడితే కనీసం గట్టిపోటీ ఇచ్చేది టీడీపీనే అని భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో పొత్తు రూపంలో బ్రేక్ పడుతుండటాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -