- Advertisement -

టీడీపీ – జనసేన..ఆ 18 సీట్లలోనే గందరగోళం!

- Advertisement -

టీడీపీ – జనసేన పొత్తుపై నీలినీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ రెండు పార్టీల మధ్య కొన్ని స్థానాల్లో పీటముడి వీడటం లేదు. జనసేన నేతల నుండి తీవ్ర ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో పవన్ సైతం ఏం చేయలేని స్థితి నెలకొంది. ప్రధానంగా 18 స్థానాల్లో టీడీపీ, జనసేన నేతలు సీటు తమకంటే తమకని ప్రచారం చేసుకుంటుండటంతో పొత్తు ధర్మంలో ఎవరు బలవుతారోననే ఉత్కంఠ మాత్రం అందరిలో నెలకొంది.

ఇక ఆ 18 స్థానాల విషయానికొస్తే తెనాలి- ఆలపాటి రాజా( టీడీపీ), నాదెండ్ల మనోహర్‌ (జనసేన) మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నాదెండ్ల జనసేనలో నెంబర్ 2గా ఉండగా ఆయన సీటుకే ఎసరు వస్తే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉండటంతో పవన్ ఈ సీటు విషయంలో తగ్గేదేలే అని చంద్రబాబుతో చెప్పారట.

అలాగే పిఠాపురం-వర్మ( టీడీపీ), తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ లేదా ముద్రగడ( జనసేన), రాజానగరం- బొడ్డు వెంకటరమణ(టీడీపీ), బత్తుల బలరామకృష్ణ( జనసేన), అవనిగడ్డ- మండలి బుద్దప్రసాద్‌(టీడీపీ), రామకృష్ణ( జనసేన జిల్లా అధ్యక్షుడు),విజయవాడ వెస్ట్‌- బుద్దా వెంకన్న(టీడీపీ), పోతిన మహేశ్‌ ( జనసేన), గుంటూరు వెస్ట్‌- కోవెలమూడి రవీంద్ర(టీడీపీ), బోనబోయిన శ్రీనివాస యాదవ్‌( జనసేన), పెందుర్తి- బండారు సత్యనారాయణ(టీడీపీ), పంచకర్ల రమేశ్‌ ( జనసేన), భీమిలి-గంటా శ్రీనివాసరావు లేదా రాజాబాబు(టీడీపీ), పంచకర్ల సందీప్‌( జనసేన) మధ్య పోటీ నెలకొంది.

అలాగే నెల్లిమర్ల – బంగార్రాజు(టీడీపీ), లోకం మాధవి( జనసేన), ధర్మవరం- పరిటాల శ్రీరాం లేదా గోనుగుంట్ల సూర్యనారాయణ(టీడీపీ), మధుసూదన్‌ రెడ్డి( జనసేన)
చీరాల- కొండయ్య యాదవ్‌(టీడీపీ), ఆమంచి స్వాములు( జనసేన), కాకినాడ- కొండబాబు(టీడీపీ), ముత్తా శశిధర్‌( జనసేన),అమలాపురం- ఆనందరావు(టీడీపీ), రాజబాబు( జనసేన), నర్సాపురం- బండారు మాధవనాయుడు(టీడీపీ), బొమ్మిడి నాయికర్‌ ( జనసేన), నర్సారావుపేట- నల్లపాటి రాము(టీడీపీ), సుభాణి ( జనసేన)
, పెడన- కాగిత కృష్ణప్రసాద్‌(టీడీపీ), బూరగడ్డ వేదవ్యాస్‌( జనసేన), రాజమండ్రి రూరల్- గోరంట్ల బుచ్చయ్య చౌదరి (టీడీపీ), కందుల దుర్గేశ్(జనసేన), తణుకు- అరుమిల్లి రాధాకృష్ణ(టీడీపీ), విడివాడ రామచంద్రరావు (జనసేన), ఉంగుటూరు- గన్ని ఆంజనేయులు (టీడీపీ), పి.దర్మరాజు (జనసేన) పోటీ నెలకొనగా పొత్తులో భాగంగా ఎవరు సీటు కొల్పోవాల్సి వస్తుందో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -