Sunday, April 28, 2024
- Advertisement -

ఇదే గొప్ప విజయం..ఆటతీరులో ఎలాంటి ఛేంజ్‌ లేదు!

- Advertisement -

టీమిండియాతో ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేన ఓటమి పాలైంది. 231 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 202 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించగా ఇంగ్లండ్‌ తరఫున తొలి టెస్టు ఆడిన స్పిన్నర్‌ హార్ట్లీ ఏడు వికెట్లతో భారత పతనాన్ని శాసించాడు.

ఈ గెలుపు తన కెప్టెన్సీలో అతి గొప్ప విజ‌యం అని చెప్పాడు స్టోక్స్. ఈ మ్యాచ్ ద్వారా ఎంతో నేర్చుకున్నానని… తాను ఓట‌ముల‌కు భ‌య‌ప‌డ‌న‌ని తెలిపాడు. గెలిచినా, ఓడినా కూడా త‌మ ఆట‌తీరులో ఎలాంటి మార్పు ఉండ‌ద‌ని స్పష్టం చేశాడు స్టోక్స్.

కెప్టెన్‌గా భార‌త్‌లో ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి అని…భార‌త స్పిన్న‌ర్లు ఎలా బౌలింగ్ చేస్తున్నారో, వారి బౌలింగ్‌కు త‌గ్గ‌ట్లుగా రోహిత్ శ‌ర్మ ఎలా ఫీల్డింగ్ సెట్ చేస్తున్నాడ‌నే విష‌యాల‌ను గమనించానని తెలిపాడు. టామ్ హార్ల్టీ అద్భుత ప్రదర్శన కనబర్చాడని తెలిపాడు. తొలి ఇన్నింగ్స్‌లో 190 ప‌రుగులు వెనుక‌బ‌డినప్పటికి ఇంత అద్భుత విజయం సాధించడం మర్చిపోలేని అనుభూతి అన్నాడు. స్టోక్స్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ జ‌ట్టు 20 మ్యాచులు ఆడగా 14 టెస్టుల్లో విజ‌యం సాధించగా 5 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -