Thursday, May 16, 2024
- Advertisement -

ఒంటరవుతున్న నారా లోకేష్‌!

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో పార్టీలో ఏం జరుగుతోంది…?ఆయన తనయుడు ఫ్యూచర్ టీడీపీ చీఫ్ అని భావించిన నారా లోకేష్ పరిస్థితి ఏంటీ…?ఇన్ని రోజులు తండ్రిచాటు బిడ్డగా ఉన్న లోకేష్‌…ఇప్పుడిప్పుడే తనేంటో నిరూపించుకుంటుండగా అంతలోనే షాక్ తగిలిందా..?అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

14 రోజుల రిమాండ్ లో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు చంద్రబాబు. ఇక ఆయనకు బెయిల్ వస్తుందా రాదా అనే సందేహం నెలకొనగా సీఐడీ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో జరిగిన అవినీతిలో మరో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఒకవేళ బెయిల్ దొరికినా మరో కేసులో బాబు అవినీతిని విచారించేందుకు సిద్ధమవుతోంది సీఐడీ.

ఈ క్రమంలో తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరును తెరపైకి తీసుకువస్తున్నారు. దీంతో లోకేష్ పరిస్థితి ఏంటా అన్నది ఆ పార్టీ నేతలకే అర్ధం కావడం లేదట. ఇక మరికొంతమంది నేతలు ఎన్టీఆర్ వస్తే టీడీపీకి భవిష్యత్ ఉంటుందని బల్లగుద్ది వాదిస్తున్నారు. దీంతో చినబాబు ఒంటరవడం ఖాయమని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఇప్పటికే పలువురు సీనియర్లు లోకేష్‌ని పట్టించుకోవడం లేదట. చంద్రబాబుకు అనుకూలంగా ఉండే కొంతమంది సీనియర్ నేతలు, లోకేష్ విషయంలో మాత్రం అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారట. ఇదే ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

ఇక చంద్రబాబు జైలులో ఉండగా టీడీపీలో జరుగుతున్న పరిణామాలను వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -