Saturday, April 27, 2024
- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ అందుకే మౌనంగా ఉన్నాడా?

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో ఆ పార్టీ శ్రేణులన్ని ఢీలా పడిపోయాయి. బాబుకు 14 రోజుల రిమాండ్ విధించగా ఆయనకు బెయిల్ వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ఇక బాబు జైలులో ఉండగానే ఆయన అవినీతి కేసులు ఒక్కొక్కటిని బయటకు తీస్తోంది సీఐడీ. దీంతో చంద్రబాబు చుట్టు ఉచ్చు బిగుసుకోగా తెలుగు తమ్ముళ్లకు పార్టీ పరిస్థితి ఏంటా అనేది అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణుల్లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ బతకాలంటే ఎన్టీఆరే దిక్కని…నారా లోకేష్‌తో ఏం కాదని చెబుతున్నారు.

ఇప్పటివరకు సీనియర్ ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యుల్లో అందరూ ముందుకు వచ్చి బాబుకు మద్దుతు పలుకుతున్నారు కానీ ఒక్క జూనియర్ ఎన్టీఆర్ తప్ప. అయితే ఎన్టీఆర్ మౌనం వెనుక రీజన్ ఉందని చెబుతున్నారు ఆయన సన్నిహితులు. తనను,తన తల్లిని చంద్రబాబు అవమాన పర్చిన విషయాన్ని జూనియర్ మర్చిపోలేదని చెబుతున్నారు. ఇక అలాగే 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్‌ని టీడీపీ ప్రచారానికి వాడుకుని తర్వాత పక్కకుపెట్టేశారు. దీనిని కూడా ప్రస్తావిస్తున్నారు జూనియర్ సన్నిహితులు.

లోకేష్ కంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో సీనియర్. అంతేగాదు జనాలను ప్రభావితం చేయడంలో దిట్టా. ఇక ఎన్నికల ప్రచారం సందర్భంగా తన ప్రాణాల మీదకు సైతం తెచ్చుకున్నారు. అయితే పలు సందర్భాల్లో మహానాడుకు సైతం జూనియన్‌ని ఆహ్వానించారు. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే జూనియర్‌ని పక్కకు పెట్టేశారు… అతని సినిమాలను చూడొద్దు అంటూ మెసేజ్ లు పాస్ చేశారు. ఇప్పుడు ఇదంతా గుర్తుచేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌.

ఇక ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చినా చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అయితే బాబుకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే తారక్ గుర్తుకొస్తాడా అని ఫ్యాన్స్‌ గుర్తుచేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ సైతం రాజకీయాలకు దూరంగా ఉండటమే మంచిదనుకుంటున్నారట. అందుకే బాబు ఎపిసోడ్‌లో ఒక్కమాట కూడా మాట్లాడటం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఏదిఏమైనా జూనియర్ ఎన్టీఆర్ పేరు ఇప్పుడు ప్రధానంగా టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -