Friday, May 3, 2024
- Advertisement -

అసంతృప్తులకు షాకిస్తూ…బీజేపీ ఫస్ట్ లిస్ట్

- Advertisement -

తెలంగాణ బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజైంది. 52 మందితో తొలి జాబితా విడుదల చేయగా ఇందులో ఎంపీలు అరవింద్, బండి సంజయ్‌లకు చోటు దక్కగా అసంతృప్త నేతలకు ఫస్ట్ లిస్ట్‌లో చోటు దక్కలేదు. పార్టీ మారుతారని ప్రచారం జరిగిన రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి పేర్లు లిస్ట్‌లో లేవు. అలాగే కిషన్ రెడ్డి, డా.లక్ష్మణ్,డీకే అరుణలకు సైతం ఫస్ట్ లిస్ట్‌లో ఛాన్స్ లభించలేదు.

ఇక ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, వరంగల్ వెస్ట్ టికెట్ ఆశించిన రాకేష్‌కు నిరాశే ఎదురైంది. ఉప్పల్‌లో ప్రభాకర్‌ స్ధానాన్ని పెండింగ్‌లో ఉంచారు. ఆ స్థానంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక ఫస్ట్ లిస్ట్‌లో ఈటల, రఘునందన్ రావులకు స్ధానం దక్కింది. ఈటల రాజేందర్ రెండు స్ధానాల నుండి పోటీ చేస్తుండగా బీజేపీ సస్పెన్షన్ ఎత్తివేసిన రాజాసింగ్‌కు లీస్ట్‌లో చోటు దక్కింది.

బీజేపీ ఫస్ట్ లిస్టులో ఉన్న అభ్యర్థుల పేర్లు ఓ సారి పరిశీలిస్తే.. సిర్పూర్ – పాల్వాయి హరీశ్, బెల్లంపల్లి (ఎస్సీ) – అమరాజుల శ్రీదేవి, ఖానాపూర్ (ఎస్టీ) – రమేశ్ రాథోడ్, ఆదిలాబాద్ – పాయల్ శంకర్,బోధ్ (ఎస్టీ) – సోయం బాపూరావ్, నిర్మల్ – ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముథోల్ – రామారావు పటేల్, ఆర్మూరు – పైడిరమేష్ రెడ్డి, జుక్కల్ (ఎస్సీ) – అరుణతార, కామారెడ్డి – కాటేపల్లి వెంకట రమణారెడ్డి, నిజామాబాద్ అర్బన్ – ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త, బాల్కొండ – ఏలేటి అన్నపూర్ణమ్మ ఉన్నారు.

కోరుట్ల – ధర్మపురి అరవింద్, జగిత్యాల – డాక్టర్ భోగ శ్రావణి, ధర్మపురి (ఎస్సీ) – ఎస్. కుమార్, రామగుండం – కందుల సంధ్యారాణి, కరీంనగర్ – బండి సంజయ్, సిరిసిల్ల – రాణి రుద్రమరెడ్డి, చొప్పదండి (ఎస్సీ) – బొడిగె శోభ, మానకొండూరు – ఆరేపల్లి మోహన్, హుజూరాబాద్ – ఈటల రాజేందర్, జనగాం – డా. ఆరుట్ల దశ్‌మంత్ రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ (ఎస్సీ) – డా. గుండె విజయ రామారావ్,పాలకుర్తి – లేగా రామ్‌మోహన్ రెడ్డి, డోర్నకల్ (ఎస్టీ) – భూక్యా సంగీత, మహబూబాబాద్ (ఎస్టీ) – జాతోత్ హుస్సేన్ నాయక్,వరంగల్ వెస్ట్ – రావ్ పద్మ, వరంగల్ ఈస్ట్ – ఎర్రబెల్లి ప్రదీప్ రావ్, వర్ధన్నపేట్ (ఎస్సీ) – కొండేటి శ్రీధర్, భూపాలపల్లి – చందుపట్ల కీర్తి రెడ్డి, ఇల్లెందు (ఎస్టీ) – రవీంద్రనాయక్, భద్రాచలం (ఎస్టీ) – కుంజ ధర్మారావ్, నర్సాపూర్ – ఎర్రగోళ్ళ మురళీ యాదవ్,పటాన్‌చెరు – నందీశ్వర్ గౌడ్, దుబ్బాక – రఘునందన్ రావు, గజ్వేల్ – ఈటల రాజేందర్, కుత్బుల్లాపూర్ – కూన శ్రీశైలం గౌడ్, ఇబ్రహీంపట్నం – నోముల దయానంద్ గౌడ్, మహేశ్వరం – అందెల శ్రీరాములు, ఖైరతాబాద్ – చింతల రామచంద్రారెడ్డి, కార్వాన్ – అమర్ సింగ్, గోషామహల్ – రాజాసింగ్, చార్మినార్ – మేఘారాణి, చాంద్రాయణ్‌గుట్ట – సత్యనారాయణ ముదిరాజ్,యాకుత్‌పుర – వీరేందర్ యాదవ్, బహదూర్‌పుర – నరేశ్ కుమార్ ఉన్నారు.

కల్వకుర్తి – తల్లోజు ఆచారి,కొల్లాపూర్ – ఎల్లేని సుధాకర్ రావ్, నాగారుజన సాగర్ – కంకనాల నివేదితా రెడ్డి, సూర్యాపేట – సంకినేని వెంకటేశ్వరరావు, భువనగిరి – గూడూరు నారాయణరెడ్డి, తుంగతుర్తి (ఎస్సీ) – కడియం రామచంద్రయ్య ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -