- Advertisement -

మూడు దశల్లో తెలంగాణ లోకల్‌బాడీ పోల్స్

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాణి కుముదిని మంగళవారం ప్రకటించారు. ఈ ప్రకటనతో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఆమె తెలిపారు.మొత్తం మూడు దశల్లో సర్పంచ్ మరియు వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

పోలింగ్ ముగిసిన రోజే ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.

మొదటి దశ వివరాలు

మొదటి దశలో అత్యధిక స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

నామినేషన్ల స్వీకరణ ప్రారంభం: నవంబర్ 27, 2025
ఎన్నికలు జరగనున్న స్థానాలు:సర్పంచ్ స్థానాలు: 4,236
వార్డు స్థానాలు: 37,440
పోలింగ్ తేదీ: డిసెంబర్ 11, 2025

రెండో దశ వివరాలు

రెండో దశలో 4,333 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
నామినేషన్ల స్వీకరణ ప్రారంభం: నవంబర్ 30, 2025
ఎన్నికలు జరగనున్న స్థానాలు:సర్పంచ్ స్థానాలు: 4,333
వార్డు స్థానాలు: 38,350
పోలింగ్ తేదీ: డిసెంబర్ 14, 2025

మూడో దశ వివరాలు

నామినేషన్ల స్వీకరణ ప్రారంభం: డిసెంబర్ 3, 2025
ఎన్నికలు జరగనున్న స్థానాలు:
సర్పంచ్ స్థానాలు: 4,159
వార్డు స్థానాలు: 36,452
పోలింగ్ తేదీ: డిసెంబర్ 17, 2025
ఉప సర్పంచ్ ఎన్నిక: ఉప సర్పంచ్ ఎన్నిక కూడా మూడో దశ పోలింగ్ తేదీ అయిన డిసెంబర్ 17నే ఉంటుందని ప్రధానాధికారి రాణి కుముదిని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియతో రాష్ట్రంలోని స్థానిక సంస్థల పాలనకు కొత్త పాలకమండళ్లు ఏర్పడనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -