థీయేట‌ర్ల‌ను ఊర్రూత‌లూగించిన పాట వ‌చ్చేసింది!

న్యాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయికగా నటించింది. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతం అందించారు.

ఈ చిత్రంలోని ‘ఆయా షేర్..’ పాట ఇప్పటికే శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. థియేటర్లలో ఈ పాటకు నాని వేసిన సిగ్నేచర్ స్టెప్పులు ప్రేక్షకులతో ఈలలు వేయించాయి. తాజాగా ప్రేక్షకుల కోరిక మేరకు ‘ఆయా షేర్..’ పూర్తి స్థాయి వీడియో సాంగ్‌ను చిత్ర బృందం అధికారికంగా విడుదల చేసింది. విజువల్స్, నాని మాస్ యాక్టింగ్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి.

మరోవైపు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలై దాదాపు రెండు వారాలు పూర్తయిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 160 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దేశీయ మార్కెట్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ నాని తన మార్కెట్ స్టామినాను నిరూపించుకున్నారు.

‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ఈ రెండో ప్రాజెక్ట్ కావడంతో దీనిపై మొదటినుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టే విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద నిలకడగా కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పుడు ‘ఆయా షేర్..’ వీడియో సాంగ్ విడుదల కావడంతో చిత్రానికి మరింత హైప్ పెరిగింది. ఈ మాస్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.