మళ్లీ ట్రెండింగ్ లోకి వ‌చ్చిన‌ త్రిష, విజయ్‌!

తమిళనాడు సినీ, రాజకీయ రంగాల్లో గత కొంతకాలంగా త్రిష పేరు మార్మోగుతోంది. తలపతి విజయ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ పేరు సోషల్ మీడియాలో మరింత ట్రెండ్‌గా మారింది. ప్రత్యర్థి పార్టీల నాయకులు సైతం ఆమెను ప్రస్తావిస్తూ పలుమార్లు విమర్శలు గుప్పించారు. తాజాగా మరోసారి త్రిష, విజయ్‌ల పేర్లు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ప్రస్తుతం సీఎం విజయ్‌ అధికారిక పర్యటన నిమిత్తం యూకేలో ఉన్నారు. అదే సమయంలో ప్రముఖ నటుడు అజిత్ కుమార్ అక్కడ జరుగుతున్న రేసింగ్ ఈవెంట్స్‌లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో యూకే వేదికగా ఇద్దరు స్టార్ హీరోలు ఒకరినొకరు కలుసుకున్నారు. అక్కడ జరిగిన రేసింగ్ పోటీలను తిలకించేందుకు ఇద్దరూ ఒకే ప్రాంతంలో కూర్చున్నారు. విజయ్‌ గ్యాలరీలో ఉండి రేసును వీక్షిస్తున్న సమయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.

అకస్మాత్తుగా నటి త్రిష ఆ గ్యాలరీలోకి వచ్చి అందరి మధ్యలోకి వచ్చారు. ఆమె రాకతో ముఖ్యమంత్రి విజయ్‌ ఒక్కసారిగా కొద్దిగా ఇబ్బందికి గురయ్యారు. అక్కడ జరుగుతున్న కెమెరా కంట్రోల్స్ గమనించి, తన ముఖం ఆ వీడియోలో స్పష్టంగా పడకుండా వెంటనే పక్కకు తిప్పుకొన్నారు.

ఈ చిన్న సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరలవుతోంది. నెటిజన్లు ఈ వీడియోను రకరకాలుగా షేర్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే తమిళ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా ఉన్న ఈ అంశం, తాజా వీడియో పుణ్యమా అని మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.