చంద్రబాబు సెల్ఫీ కష్టాలు!

వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఎంచుకున్న అస్త్రం సెల్ఫీ. టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధిని అలాగే వైసీపీ ప్రభుత్వంలో ప్రజల కష్టాలను సెల్ఫీ రూపంలో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎవరు తీసుకున్న గొయ్యిలో వారే పడ్డట్టు అదే సెల్ఫీ ఇప్పుడు బాబును కమెడీయన్‌గా మార్చడమే కాదు ఆయన చేత ఫీట్స్ చేయిస్తోంది.

ఓ కుంట దగ్గర నిల్చుని సెల్ఫీ దిగే ప్రయత్నం చేశారు చంద్రబాబు. ఈ క్రమంలో సెల్ఫీ తీయడం రాక ఆయన నాన అవస్థలు పడ్డారు. అటో ఇటో చివరకు సెల్ఫీ దిగి అక్కడినుండి జారుకున్న ఇదంతా వీడియో తీసిన అక్కడివారే సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్‌గా మారింది. సెల్ఫీ దిగడానికి చంద్రబాబు పడిన కష్టాలను చూసి నవ్వుకుంటున్నారు.

ఇక దీనిని క్యాచ్ చేసుకుంటున్న వైసీపీ శ్రేణులు బాబును ట్రోల్ చేస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు చేస్తున్న ప్రయత్నం ద్వారా మాకు మంచే జరుగుతుందని కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు కొన్ని సందర్బాల్లో దిగిన సెల్ఫీ ఫోటోలు వైసీపీకే అనుకూలంగా ఉన్నాయి. అయితే ఇవేమీ గమనించని టీడీపీ నేతలు వాటిని సైతం సోషల్ మీడియాలో పోస్టు చేస్తుండగా వైసీపీ చేసిన అభివృద్దికి బాబే బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని కామెంట్స్ చేస్తున్నారు.

ఏపీలోని రోడ్లపై టీడీపీ నేతలు, జనసేన నేతలు పలుమార్లు విమర్శలు గుప్పించారు. అంతేగాదు జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదని గుంతలు పూడ్చే పనికూడా చేశారు. అయితే రీసెంట్ ఓ సెల్ఫీ ఫోటో దిగారు చంద్రబాబు. ఈ ఫోటోలో రోడ్డు మాత్రం అద్దంలా మెరిసిపోతోంది. అంతే చంద్రబాబుకు థ్యాంక్స్ చెబుతూ ఇది జగన్ పరిపాలనలో రహదారుల పరిస్థితి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏదిఏమైనా చంద్రబాబు చెప్పాలనుకున్నది ఒకటైతే జరిగేది మాత్రం ఇంకోలా ఉందని పలువురు వాపోతున్నారు.