- Advertisement -

జగన్ ప్రత్యేక విమానం…ఇది అసలు సంగతి!

- Advertisement -

ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటనపై టీడీపీ రాద్దాంతం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రజాధనాన్ని దుర్వినియెగం చేసి జగన్ ప్రజల సొమ్ముతో విదేశాల్లో పర్యటిస్తున్నారని టీడీపీ ప్రచారం చేస్తోంది. ఇక ప్రజల్లో సైతం దీనిపై అనేక అపోహలు ఉన్నాయి. అయితే అసలు జగన్ వ్యక్తిగత పర్యటన కోసం నిజంగానే ప్రజధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారా…?ప్రజల సొమ్ముతోనే విదేశాలకు వెళ్లారా అంటే కాదనే చెప్పాలి. జగన్ తన సొంత ఖర్చులతో విదేశాలకు వెళ్లారని వైసీపీ నేతలు తేల్చిచెబుతున్నారు. జగన్ సొంత ఖాతా నుండే ఖర్చుల చెల్లింపు జరుగుతుందని ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు.

అసలు జగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన ప్రతిసారి టీడీపీ నేతలు చేసే చవకబారు ఆరోపణలు ఇవే. ప్రజా ధనాన్ని జగన్ నీళ్లలా ఖర్చు చేస్తున్నారని విమర్శలు చేస్తుండగా తాజాగా అవన్ని సత్యదూరమని తేలియపోయాయి. వాస్తవానికి జగన్ తన అధికారిక ప‌ర్యట‌న‌ల కోసం వివిధ జిల్లాల‌కు వెళ్లేట‌ప్పుడు హెలికాప్టర్ లేదా ఎక్కువ‌గా చార్టర్డ్ విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ఇక విదేశాలకు వెళ్లినప్పుడు తన సొంత ఖర్చులతోనే వెళ్తున్నారు.

అయితే టీడీపీ నేతలు మాత్రం జగన్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేసి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. నిజం గడపదాటే లోపు అబద్దం ప్రపంచమంతా షికార్ చేస్తుందట. ఇదే వాదాన్ని పట్టుకుని టీడీపీ నేతలు సత్యదూరమైన ప్రచారానికి తెరలేపగా దీనిని వైసీపీ నేతలు సైతం ప్రజాక్షేత్రంలో గట్టిగానే తిప్పికొడుతున్నారు. టీడీపీ నేతలు ఇప్పటికైనా తమ చవకబాబు విమర్శలకు పుల్ స్టాప్ పెట్టాలని లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నారు వైసీపీ నేతలు. .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -