Friday, May 3, 2024
- Advertisement -

నిద్రపోండి..లక్షల్లో సంపాదించండి !

- Advertisement -

గొడ్డు చాకిరి పనులను మేము చెయ్యలేము.. రోజుకు 8 గంటలు కూర్చొని.. బాస్ తిట్లను భరిస్తూ.. ఉండే ఉద్యోగం పట్ల బోర్ కొట్టేసిందా.. ఎలాంటి ఒత్తిడి లేకుండా.. కాలు కదరపకుండా.. శారీరక శ్రమ లేకుండా ఉద్యోగం చేసి లక్షలు సంపాదించాలనుకుంటున్నారా. అయితే అలాంటి వారికోసమే ఈ వార్త. కేవలం మీరు రోజూ 9 గంటలు నిద్రపోతే చాలు అక్షరాల లక్షరూపాయలు సంపాదించినట్టే.

పదండి మరి ఇందుకు కావాల్సిన అర్హతలేంటో చూసేద్దాం. రోజుకు 9 గంటలు నిద్రపోతూ.. 100 రోజులకు రూ.10,00,000 సంపాదించే ఉద్యోగాన్ని మ్యాట్రెసెస్ తయారు చేసే స్టార్టప్ వేక్ ఫిట్ అందిస్తోంది. ఈ వేక్ ఫిట్ స్లీప్ ఇంటర్న్స్ కోసం 2021-22 బ్యాచ్ వాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఇందులో కొందరిని వారే ఎంపిక చేస్తారు. వారు చేయాల్సింది కేవలం వంద రోజుల పాటు 9 గంటలు నిద్రపోవడమే. దీన్నిసక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేస్తే..వారిని స్లీప్ ఛాంపియన్ గా ఎంపిక చేసి రూ.10,00,000 బహూకరిస్తారు. స్లీప్ ఎంటర్న గా ఎంపికైన ఒక్కొక్కరికి అక్షరాల లక్ష రూపాయలు పొందవచ్చు.

ఈ స్లీప్ ఇంటర్న్ షిప్ కు దరఖాస్తు చేయాలంటే మీరు డిగ్రీ పాసై ఉండాలి. 10 లేదా 20 నిమిషాల్లో నిద్రపోవాలి. అలాగే అల్కహాల్, కెఫీన్ ను ఎక్కువగా తీసుకోకుండా ఉండటంతో పాటుగా అర్థరాత్రి వరకు మెళుకువ ఉండకూడదు. నిద్ర పోవడానికి టిప్స్ తెలిసి ఉండాలి. మీరు ఈ జాబ్ చేయాల్సింది ఎక్కడో ఆఫీసుల్లో కాదు.. మీ ఇంటిదగ్గర నుంచే. ఈ అర్హతలు గనుక మీకు ఉన్నట్టైతే.. అన్ని నిశితంగా పరిశీలించి https://wakefit.co/sleepintern/వెబ్ సైట్ లో అప్లై చేసుకోండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -