Thursday, May 16, 2024
- Advertisement -

శరీర వేడికి తాలలేకపోతున్నారా.. అయితే ఈ చిట్కాలు మీ కోసం..

- Advertisement -

ఎండాకాలం వచ్చిందంటే చాలు శరీరంలో ఉష్ణగ్రతలు పెరిగిపోతాయి. దీనికి కారణం మారుతున్న జీవన శైలి, మనం తీసుకునే ఆహారపు అలవాట్లు ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు. శరీర వేడి వలన అనేక సమస్యలు తలెత్తుతాయి. విపరీతమైన తలనొప్పి, మలబద్దకం, నీరసం లాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బాడీ డీహైడ్రేట్ అవ్వడం వల్లే ఇలాంటి అనేక సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. కొన్ని చిన్న చిన్నచిట్కాలను పాటిస్తే సరి ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఒకే చోట తరబడి కూర్చోకుండా.. కొద్ది సేపు అటూ ఇటూ తిరుగుతూ ఉండాలి. ఇలా ఒకేచోట గంటలు గంటలు కూర్చోవడం వల్ల శరీరంలో వేడి పెరుగుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం కూర్చున్న ప్లేస్ లో ఫ్యాన్ లేదా, కూలర్లు ఉండేలా చూసుకోవాలి.

తరచుగా ఛాతి, మణికట్టు భాగాల్లో చల్లటి నీళ్లతో లేడా ఐస్ ను రాస్తే వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా బాడీ డీ హైడ్రేట్ కాకుండా తరచుగా నీళ్లు, జ్యూస్ లు తాగుతుండాలి. అలాగే ఒక టీ స్పూన్ మెంతులను అలాగే తినవచ్చు.. లేదా వాటిని పొడి చేసి నీళ్లలో కలుపుకుని తాగినా వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు. స్విమ్ చేయడం లేదా.. స్నానం చెయ్యడం ద్వారా కూడా బాడీ వేడిని కొంతవరకు తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -