కీళ్ల నొప్పులు అన్ని వయస్సుల వారిని ప్రభావితం చేసే సాధారణ సమస్య. ఆర్థరైటిస్, అధిక బరువు, వాపులు, క్రీడల గాయాలు, అధిక వినియోగం, అస్వస్థ జీవనశైలి వంటి కారణాల వల్ల ఇది వస్తుంది. వయస్సు పెరిగేకొద్దీ ఎముకల చివరలను రక్షించే కార్టిలేజ్ తగ్గిపోవడం, శరీరంలో నీటి నిల్వలు తగ్గడం వల్ల షాక్‌ను తట్టుకునే సామర్థ్యం తగ్గుతుంది.
జాయింట్ పెయిన్స్ ఉన్నప్పుడు రన్నింగ్, యోగా లేదా జిమ్ ఈ మూడింట్లో ఏది బెటర్. మితమైన వ్యాయామం మరియు కార్డియో కార్యకలాపాలు జాయింట్ల కదలికలను మెరుగుపరుస్తాయి. అయితే తక్కువ ఒత్తిడి (లో-ఇంపాక్ట్) కలిగిన వ్యాయామాలనే ఎంచుకోవాలి. హెచ్ఐఐటీ వంటి హై-ఇంటెన్సిటీ వ్యాయామాలను నివారించడం మంచిది.
రన్నింగ్: సరైన పద్ధతిలో, మితంగా చేస్తే రన్నింగ్ జాయింట్లను బలపరుస్తుంది. ఇది కార్టిలేజ్ ఆరోగ్యాన్ని మెరుగుపరచి, బరువును నియంత్రిస్తుంది. అయితే తప్పు టెక్నిక్ లేదా అధికంగా పరుగెత్తడం వల్ల మోకాళ్లు, నడుం సమస్యలు రావచ్చు. క్వాడ్రిసెప్స్, హామ్‌స్ట్రింగ్స్, కాల్వ్స్ వంటి కండరాలను ముందుగా బలపరచాలి.
యోగా: తీవ్రమైన జాయింట్ నొప్పి ఉన్నవారికి యోగా ఉత్తమ ఎంపిక. అష్టాంగ, విన్యాస, హఠ వంటి విధానాలు శ్వాసాభ్యాసాలు, ఆసనాల ద్వారా శరీరాన్ని సడలిస్తాయి. వారియర్ పోజ్‌లు, బ్రిడ్జ్ పోజ్, బౌండ్ యాంగిల్ పోజ్ వంటి ఆసనాలు ఉపశమనం ఇస్తాయి.
జిమ్: సరైన మార్గదర్శకత్వం లేకుండా బరువులు ఎత్తడం హానికరం. వర్కౌట్‌కు ముందు వార్మ్-అప్, తగిన విశ్రాంతి తప్పనిసరి.
తీవ్రమైన నొప్పి, వాపు, జ్వరం, అకస్మాత్తుగా కదలిక తగ్గితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
