Sunday, June 16, 2024
- Advertisement -

పవన్..ఇండస్ట్రీలో భజనే..పాలిటిక్స్‌లో భజనే!

- Advertisement -

భజన..భజన అని ఓ సినిమాలో వచ్చే డైలాగ్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఇది సరిగ్గా జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు సరిపోతుంది. ఎందుకంటే పవన్ అంటేనే భజన అనే విధంగా తయారైంది ప్రస్తుతం. అది సినిమానా, ప్రీ రిలీజ్ ఫంక్షనా, ఆడియో రిలీజ్ ఫంక్షనా లేదా పొలిటికల్ మీటింగ్ ఏదైనా పవన్ కళ్యాణ్ భజనతోనే సరిపోతుంది. అయితే విశేషం ఏంటంటే ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలోనే ఈ భజన చూశాం కానీ ఇప్పుడు పాలిటిక్స్‌లోనూ తయారైంది.

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించి తెగ హడావిడి చేస్తున్నారు పవన్. మొదట సింగిల్ తర్వాత బీజేపీతో కలిసి పోటీ చేస్తామని చెప్పారు. బీజేపీతో కలిసి ప్రచారం చేసేందుకు పవన్ సిద్ధమవుతుండగా తాజాగా బీసీ బహిరంగ సభలో మోడీ సర్కార్ ను ఆకాశానికెత్తుతూ మోడి పై పొగడ్తల వర్షం కురిపించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను మోడి అగ్రగామిగా నిలిపారని, ప్రతి భారతీయుడి గుండెల్లో మోడీ ఉంటారని ఓ తెగ భజన చేసేశారు.

అయితే బీజేపీకి భజన చేయడం పవన్ నైజం అయినప్పటికి, తెలుగు రాష్ట్రాలకు మోడీ సర్కార్ చేసిన అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని సామాన్యులు నిలదీసే పరిస్థితి నెలకొంది. ప్రశ్నించడానికే వచ్చానన్న పవన్…ఇప్పుడు భజన చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే తెలంగాణలో పవన్ ..గెలవటం సంగతి పక్కనపెట్టేస్తే అసలు డిపాజిట్లయినా దక్కుతాయా ఆలోచించుకోవాలని చురకలు అంటిస్తున్నారు. ఇక తెలంగాణలో గెలుపు సంగతి పక్కన పెడితే కనీసం డిపాజిట్లు కూడా దక్కకపోతే దాని ప్రభావం ఏపీ ఎన్నికల్లో స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో పవన్ ఏం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారో…ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియాలని ఆ పార్టీ నేతలే సూచిస్తున్న పరిస్థితి నెలకొంది?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -