Sunday, June 16, 2024
- Advertisement -

పీకే అంచనాలు ఎప్పుడూ తప్పే!

- Advertisement -

పొలిటికల్ ఎనలిస్ట్ ప్రశాంత్ కిషోర్‌పై అంచనాలు ఎప్పుడూ తప్పేనని మండిపడింది వైసీపీ. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేసిన వైసీపీ గతంలో ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియోని షేర్ చేసింది.

చంద్రబాబుకు మరో ప్యాకేజి స్టార్‌లా మారిపోయాడని…ఎన్నికల ఫలితాలపై పీకే వేసే అంచనాలు ఎప్పుడూ తప్పేనంటూ పేర్కొంది. సీనియర్‌ జర్నలిస్టు కరణ్‌ థాపర్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ప్రశాంత్‌ కిశోర్‌ తన సహనాన్ని కోల్పోయినట్లు ఆ వీడియోలో ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోతుందంటూ చెప్పిన జోస్యం తప్పింది కదా అని పీకేని కరణ్‌ థాపర్‌ ప్రశ్నించారు. దానికి తాను జోస్యాలు చెప్పే వ్యాపారం చేయడం లేదంటూ సమాధానమిచ్చాడు. అంతేకాకుండా హిమాచల్‌లో కాంగ్రెస్‌ గెలుస్తుందని తాను అన్నట్లుగా వీడియో రికార్డులు ఉంటే చూపించాలని డిమాండ్‌ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -