Thursday, May 8, 2025
- Advertisement -

రాజకీయాలకు వైసీపీ నేత ఆళ్ల నాని గుడ్ బై

- Advertisement -

రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ఏపీ మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ నేత ఆళ్ల నాని. తన రాజీనామా లేఖను అధ్యక్షుడు జగన్‌కు పంపించారు. వైసీపీ ప్రాధమిక సభ్యత్వంతో పాటు ఏలూరు నియోజకవర్గం ఇంచార్జి పదవికి, ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు.

ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష్య పూరిత పాలిటిక్స్ చేస్తోంది. ముఖ్యంగా వైసీపీ నేతలే టార్గెట్‌గా దాడులకు తెగబడుతున్నారు. కాంగ్రెస్ నుండి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు ఆళ్లనాని. 1999లో ఏలూరు అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు .ఆ తర్వాత 2004, 2009లో ఏలూరు నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు.

2014లో ఓటమి ఆ తర్వాత 2019లో వైసీపీ నుండి విజయం సాధించారు. అనంతరం జగన్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఏలూరు నుండి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -