Monday, May 5, 2025
- Advertisement -

పార్టీ కార్య‌క్ర‌మంలో పాల్గొని తిరిగి వ‌స్తుండ‌గా ఘ‌ట‌న‌ …

- Advertisement -

మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. బాలినేని ఓ స్థానికంగా నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఒంగోలు వెళ్తునన్న సమయంలో ఒంగోలు సమీపంలోని త్రోవగుంటకు రాగానే దగ్గర బాలినేని ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా టైరు బరస్ట్ అయ్యి అదుపు తప్పిన కారు రోడ్డు పక్కకు దూసుకుపోయింది. డ్రైవర్ అప్రమత్తతతో కారును అదుపు చేసాడు. దీంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది

ఈ ఘటనలో అదే సమయంలో బైక్ పై అటుగా వెళుతున్న మార్నేని ఆంజనేయులు అనే వ్యక్తిని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆంజనేయులుకు తీవ్ర గాయాలయ్యాయి. బాలినేని మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. గాయపడ్డ ఆంజనేయులును ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -