ఎమ్మెల్సీ వాణీదేవి కారుకు ప్రమాదం..!

- Advertisement -

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి- హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచిన‌ సురభి వాణీదేవి కారు ప్రమాదం జరిగింది. దాంతో అసెంబ్లీ వద్ద తీవ్ర కలకలం రేగింది. గురువారం అసెంబ్లీలో స్పీకర్‌ని కలిసేందుకు ఆమె కారులో వచ్చారు. వాణీదేవి కారు దిగిన అనంతరం గేట్ నంబ‌రు 8 దగ్గర పార్కింగ్ స్థలంలో వాహనం అదుపు తప్పడంతో  గేట్‌ను కారు ఢీ కొట్టింది.

బ్రేక్‌కి బదులు యాక్సిలేటర్ తొక్కడంతో కారు అదుపుతప్పి విధుల్లో ఉన్న పోలీసులపైకి దూసుకెళ్లింది. వారంతా అప్రమత్తమై తప్పించుకోగా కారు పార్కింగ్ గేటును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఆ స‌మయం‌లో భారీ శ‌బ్దం రావ‌డంతో అందరూ షాక్ తిన్నారు.

- Advertisement -

ఆ స‌మయంలో అందులో వాణీదేవి లేకపోవడంతో ఆమెకు ప్రమాదం తప్పింది. భద్రతా సిబ్బంది అప్రమత్తమై తప్పించుకోకపోతే ప్రాణనష్టం జరిగేదని తెలిపారు. మొత్తానికి ఎవ్వ‌రికీ గాయాలు కాక‌పోవ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు.

సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రామ్ చరణ్!

కోవిడ్ సెకండ్ వేవ్ – మనం తీసుకోవలసిన జాగ్రత్తలు!

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -