Friday, April 26, 2024
- Advertisement -

కడప పేలుళ్ల ఘటనలో వైసీపీ నేత నాగేశ్వరరెడ్డి అరెస్ట్!

- Advertisement -

కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె పేలుడు ఘటన పెను సంచలనం రేపింది. ఈ ఘటనలో 10 మంది బలి అయ్యారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఐదు ప్రభుత్వ శాఖలతో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. కడప జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) ఆధ్వర్యంలో మైనింగ్, రెవెన్యూ, పోలీస్, సేఫ్టీ, ఎక్స్‌ప్లోజీవ్స్‌ శాఖలకు చెందిన అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్టు గనులు- భూగర్భ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం తెలిపారు.

తాజాగా పేలుళ్లకు సంబంధించిన కేసులో వైసీపీ నేత సి.నాగేశ్వరరెడ్డి, పేలుడు పదార్థాలు సరఫరా చేసిన రఘునాథ్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని కలసపాడు మండలం మామిళ్లపల్లె గ్రామ పరిధిలోని ముగ్గురాయి గనుల్లో ఈ నెల 8న జరిగిన పేలుళ్లలో 10 మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. 2013లో జీపీఏ తీసుకుని నాగేశ్వరరెడ్డి ఈ గనిని నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పర్యావరణ అనుమతులు కూడా లేవని, ఇక్కడ పేలుళ్లు జరపకూడదని ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు.

ఇక గని వాస్తవ లీజుదారులకు కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తామని ఎస్పీ తెలిపారు. కాకపోతే పేలుడు పదార్థాలు సరఫరా చేసేందుకు రఘునాథరెడ్డికి లైసెన్స్ ఉందని, అయితే వాటి రవాణా విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదని, అందుకనే ఆయననూ విచారిస్తున్నట్టు చెప్పారు.

ఎన్టీఆర్ కి కరోనా.. త్వరగా కోలుకోవాలి బ్రదర్ అంటూ మహేష్ ట్వీట్!

కంగనాకు మరో షాక్.. ఈసారి ఇన్‌స్టాగ్రామ్

విజయ్ రెమ్యూనరేషన్ వింటే షాక్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -