- Advertisement -

కల్తీ మద్యంపై వైసీపీ నగారా

- Advertisement -

ఏపీ వ్యాప్తంగా కల్తీ మద్యంపై నగారా మోగించింది వైసీపీ. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. పులివెందుల లో వైస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీలో నకిలీ మరియు కల్తీ మద్యాన్ని అరికట్టాలని కార్యక్రమము చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలు, కార్యకర్తలు మరియు నాయకులు మాట్లాడుతూ కల్తీ మద్యాన్ని అరికట్టాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ లో మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై. యస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో నకిలీ మద్యం ను అరికట్టాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ , మాజీ శాసనసభ్యురాలు విశ్వాసరాయి కళావతి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. వైయస్ఆర్ సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నకిలీ మద్యం పై కర్నూలు ఎక్సైజ్ సూపరిండెంట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

గుంటూరు శంకర్ విల్లాస్ సెంటర్ వద్ద నుండి ప్రారంభమైన కల్తీ మద్యం మరియు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన ర్యాలీ బ్రాడీపేట ఎక్సైజ్ కార్యాలయం వద్ద ముగిసి, సంబంధిత అధికారులకు మెమోరాండం సమర్పించారు. యర్రగొండపాలెం నియోజకవర్గం కేంద్రం నందు నకిలీ మద్యం తయారీ కి వ్యతిరేకంగా తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ భారీ ఎత్తున నిర్వహించారు

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నకిలీ N బ్రాండ్ మద్యం వ్యతిరేక నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ , జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు.శ్రీకాకుళం జిల్లా, పలాస నియోజకవర్గంలో భారీ ర్యాలి చేపట్టారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

చిత్తూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో నకిలీ మద్యంపై వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరు బాట,నిరసన కార్యక్రమం చేసి
స్థానిక ఎక్సైజ్‌ అధికారులకు వినతిపత్రాల సమర్పించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా చలామణి అవుతున్న నకిలీ మద్యాన్ని అరికట్టాలంటూ వైఎస్ఆర్సిపి రాజమండ్రి కోఆర్డినేటర్ మార్గాని భరత్ ఆధ్వర్యంలో మహిళల నిరసన చేపట్టారు. రాజమండ్రి రామాలయం సెంటర్లో మానవహారం, నకిలీ మద్యం బాటిళ్ళ ప్రదర్శన చేపట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -