- Advertisement -
అక్టోబర్, నవంబర్ నెలల్లో అనేక శుభవివాహ ముహూర్తాలు ఉండటంతో, వివాహ సీజన్ ఉత్సాహంగా ప్రారంభమైంది. షాపింగ్ మాల్స్, దుస్తుల దుకాణాలు, బంగారు నగల షాపులు జనసంచారంతో కళకళలాడుతున్నాయి. కుటుంబాలు ఘనమైన వేడుకల కోసం సన్నాహాలు ప్రారంభించాయి.
అక్టోబర్ 12 నుండి నవంబర్ 27 వరకు వరుసగా శుభవివాహ ముహూర్తాలు ఉన్నాయి. ఇప్పటికే వివాహాల హడావుడి మొదలైంది. ముఖ్యమైన ముహూర్తాలు అక్టోబర్ 24, 26, 29, 30, 31, అలాగే నవంబర్ 7, 8, 15, 22, 26, 27 తేదీల్లో ఉన్నాయి. దీంతో ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ సెంటర్లు, హోటళ్లు, వివాహ వేదికలకు ఫుల్ డిమాండ్ పెరిగింది.
ఇప్పటికే అక్టోబర్ మొదటి వారంలోనే కొన్ని వివాహాలు జరిగిపోయాయి. రాబోయే తేదీలకు సంబంధించిన బుకింగ్స్ దాదాపుగా పూర్తి అయ్యాయి. నవంబర్ 27 తర్వాత ఫిబ్రవరి 14 వరకు శుభముహూర్తాలు ఉండవు.
