- Advertisement -

రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం!

- Advertisement -

రైతులకు కావలసిన యూరియాను వెంటనే సప్లే చేయాలి..కూటమి ప్రభుత్వం పాలనలో 250మంది అన్నదాతలు ఆత్మహత్యచేసుకున్నారు అన్నారు వైసీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కేకే రాజు. రైతును రాజుగా చూడాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో జగన్ మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతు పంట విత్తనం వేసిన దగ్గర నుండి పంటకు మద్దతు ధర వచ్చేవరకు రైతన్నలకు జగన్ సర్కారు భరోసాగా ఉండేది అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు , పంపిణీ చేస్తే రైతు భరోసా కేంద్రాలకు రైతులు వచ్చినప్పుడు జగన్ గారు గుర్తుకు వస్తారని కక్షతో కూటమి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేసిందని అన్నారు..ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో రైతులకు కావలసిన యూరియా కేటాయింపు విషయంలో డిమాండ్ కు సరిపడా సప్లై లేదని మండిపడ్డారు.

రాజకీయాల్లో 40 సంవత్సరాలు అనుభవం ఉందని సంపద సృష్టిస్తానని కల్లబొల్లి కబుర్లు చెప్పిన చంద్రబాబు రైతన్నకు కావలసిన యూరియా సరఫరా చేయలేక పోతున్నారు అని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా రైతులు మేలు కోరి రైతు సంక్షేమంను దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అంటే దేశానికి అన్నపూర్ణ వంటిదని అలాంటి రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 14 నెలలు కాలంలో రాష్ట్రంలో 250 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారంటే వ్యవసాయ రంగాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తుందో ప్రజలందరూ అర్థం చేసుకోవాలని అన్నారు.

రైతు సంక్షేమానికి జగన్ ఇస్తున్న సంక్షేమానికి మించి రైతు భరోసా” పథకం ద్వారా రైతులకు భరోసా ఇస్తామని ప్రమాణం చేసిన కూటమి నాయకులు ఇప్పుడు రైతన్నలకు న్యాయం చేయడం లేదని మండి పడ్డారు. నిన్న రైతు భరోసా కార్యక్రమంలో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ నేను బ్రతికి ఉన్నంత వరకు రైతుకు భరోసా అనేది ఉండదు అని చంద్రబాబు నాయుడు అన్న మాటలకు రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని వారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు..ఈ రాష్ట్రంలో అన్నదాత సంతోషంగా ఉంటేనే దేశం బాగుపడుతుందని వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని ఈ రాష్ట్రంలో అన్నదాత లను ఆదుకోవాలని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -