ఓవల్ వేదికగా భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు భారత పేసర్ మహమ్మద్ సిరాజ్. ఓవర్ నైట్ స్కోరు 347 పరుగులతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ .. 354 పరుగులకు ఆలౌట్ కాగా భారత్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ విజయం సాధించాలంటే 35 పరుగులు కావాల్సి ఉండగా…భారత్ విజయానికి నాలుగు వికెట్లు కావాలి.
ఈ క్రమంలో భారత పేసర్లు అద్భుత పోరాట పటిమను కనబర్చారు. ముఖ్యంగా సిరాజ్ మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. దీంతో ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2-2తో సమమైంది.
మ్యాచ్ అనంతరం సిరాజ్ మాట్లాడుతూ.. నా ఫోన్‌లో బిలీఫ్ అన్న పదం వాల్‌పేపర్‌గా ఉంది.. ఆ నమ్మకమే ఇవాళ జట్టు విజయాన్ని దోహదపడిందన్నారు. వికెట్లు తీయడంపై దృష్టి సారించానని తెలిపాడు.
ఇక ఈ మ్యాచ్‌లో క్యాచ్ వదిలిపెట్టడంపై స్పందించిన సిరాజ్.. అసలు నేను క్యాచ్ పట్టిన తర్వాత బౌండరీ కుషన్‌పై పాదం పెట్టినట్టూ నాకే అర్థం కాలేదు అని… ఆ క్షణం మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అయింది అన్నాడు. ఈ విజయంతో ఏ పరిస్థితిలోనైనా నేను జట్టుకి విజయం అందించగలను అనే నమ్మకం కలిగిందని తెలిపాడు.
