ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. మూడు స్థానాలు వైసీపీకే దక్కనుండగా ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను దాదాపు ఖరారు చేశారు సీఎం జగన్. సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డితో పాటు మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబూరావు పేర్లు దాదాపు ఖరారయ్యాయి.
ఇద్దరు రెడ్డి , ఓ ఎస్సీ సామాజిక వర్గ నేతకు అవకాశం కల్పించాలని జగన్ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి రెండు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక ఎల్లుండి అసెంబ్లీలో రాజ్యసభ ఎన్నికలపై మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు.
ఇక టీడీపీ సైతం రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థిని బరిలో దించే ఆలోచన చేస్తోంది. ఇక టీడీపీ అభ్యర్థిని దించుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండగా మాక్ పోలింగ్ ద్వారా ఏ ఎమ్మెల్యే ఎవరికి ఓటు వేయాలన్న దానిపై క్లారిటీ ఇవ్వనున్నారు. మరోవైపు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది. మొత్తంగా మూడు రాజ్యసభ స్థానాలు వైసీపీకే దక్కేలా ప్లాన్ చేశారు జగన్.