Monday, May 20, 2024
- Advertisement -

బస్సుయాత్ర ట్రైలర్‌తోనే చుక్కలు చూపించారా?

- Advertisement -

వైనాట్ 175,why ap needs jagan ఇప్పుడు ఇదే స్లోగన్‌తో దూసుకుపోతున్నాయి వైసీపీ శ్రేణులు. ఎన్నికలకు 6 నెలల సమయం మాత్రమే ఉండగా అప్పుడే కదనరంగంలోకి దూకేశారు. ఇక ఈ నెల 26 నుండి వైసీపీ బస్సుయాత్ర ప్రారంభంకానుండగా ఏపీ వ్యాప్తంగా ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. బస్సుయాత్ర ద్వారా అనుసరించే వ్యూహాలు, ప్రజలను అడగాల్సిన ప్రశ్నలపై ఇప్పటికే వైసీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

కార్యకర్తల్లో జోష్ పెంచేందుకు బస్సుయాత్రకు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు. మొత్తం రెండు నిముషాల నాలుగు సెకండ్లు ఉన్న ఈ వీడియో ఆధ్యంతం ప్రజలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.పేదల సంక్షేమం కోసం వైసీపీ పాలనలో ఏం చేశామనే దానినే ప్రధానంగా ప్రస్తావిస్తూ వీడియోని ఎడిట్ చేశారు. సామాజిక న్యాయం అంటే అసలైన అర్ధం ఏంటో కూడా ఈ ట్రైలర్ లో చెబుతూ వచ్చారు. వైసీపీ విడుదల చేసిన వీడియో ఏపీ పాలిటిక్స్ లో సంచలనంగా మారింది.

మొత్తంగా ఈ నెల 26 నుంచి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు అంతా ప్రజల్లోనే ఉండనున్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఒక సభ జరిగేలా మొత్తం రెండు నెలలలో ఈ బస్సు యాత్రను పూర్తి చేయడానికి వైసీపీ టార్గెట్ గా పెట్టుకుంది. ఇక 6 నెలల ముందుగానే పక్కా ప్రణాళికతో జగన్‌ మరోసారి తిరుగులేని మెజార్టీతో గెలుపొందేందుకు చేస్తున్న ప్రయత్నం సఫలీకృతం కావడం ఖాయమనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -