Saturday, May 4, 2024
- Advertisement -

కొంచెం ఓవ‌ర్‌గా త్రివిక్ర‌మ్ మాట‌లు

- Advertisement -

తెలుగులో పవన్ కళ్యాణ్ తిరుగులేని స్టార్‌డ‌మ్‌కి తిరుగు లేదు.అలాగే పొలిటిక‌ల్‌గా కూడా ప‌వ‌న్‌కు మంచి మైలేజ్ ఉంది.ఇక పవన్ మాంచి ఎంటర్టైనర్. ఈ విషయాల్లో ఎవరికీ సందేహాల్లేవు. అయితే ప‌వ‌న్ గొప్ప న‌టుడు కాదు అనే విష‌యం అంద‌రికి తెలిసిన విష‌య‌మే.ప‌వ‌న్ గ‌త సినిమాల‌ను చూస్తే ప‌వ‌న్ ఓకే, బాగా చేశాడు అంటారు ,కాని అద్భుతంగా న‌టించాడు అనే వాఖ్య‌లు వినిపించ‌వు.

ప‌వ‌న్ సినిమాల రిలీజ్ అప్పుడు ,అత‌ని ఎనర్జీ గురించి , ఎంటర్టైన్ చేసే తీరు గురించే చర్చ జరుగుతుందే తప్ప అత‌ని న‌ట‌న గురించి చ‌ర్చ అస‌లు రానే రాదు.దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం ఈ చిత్ర ఆడియో వేడుకలో ప‌వ‌న్‌లోని న‌ట‌విశ్వ‌రూపం చూస్తారు ,అనే పెద్ద స్టెట్మెంట్ ఇచ్చేశాడు.

పవన్‌ను ఎప్పుడూ గొప్ప నటుడిగా ఎవరూ చూడలేదు. గ్రేట్ ఎంటర్టైనర్‌గానే చూస్తూ వచ్చారు. ఇప్పుడు ఉన్నట్లుండి నట విశ్వరూపం అనేసరికి కొత్తగా అనిపించింది. ఉన్న మాట చెప్పాలంటే ఈ తరంలో నటన పరంగా అందరి కంటే ముందుండేది జూనియర్ ఎన్టీఆర్. ఈ విషయం వేరే హీరోల అభిమానులు కూడా అంగీకరిస్తారు. పవన్ సమవుజ్జీ మహేష్ బాబుకు కూడా నటుడిగా మంచి పేరుంది. కానీ పవన్ ఆ కేటగిరిలోకి రాడు. స్టైల్, ఎనర్జీ, గ్రేస్, క్రేజ్, ఇలాంటి విషయాల జోలికి వస్తే మాత్రం పవన్‌కు తిరుగులేదు. మిగతా వాళ్లు అతడి వెనుకే ఉంటారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -