Friday, April 26, 2024
- Advertisement -

ప్ర‌జ‌ల‌పై పిడుగు వేయ‌నున్న కేంద్ర స‌ర్కార్‌

- Advertisement -

బ్యాంకులో మీకు ఖాతా ఉందా? పొదుపు ఖాతా.. క‌రెంట్ ఖాతా.. త‌దిత‌ర ఖాతాలు ఉన్నాయా? వ‌వీటికి భ్ర‌ద‌త క‌ల్పించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఓ చ‌ట్టం తీసుకురానుంది. ఈ చ‌ట్టం కోసం ఇప్పుడు ఓ బిల్లు తీసుకువ‌చ్చింది. బ్యాంకులోని మీ న‌గదుకు భ‌ద్ర‌త క‌ల్పించేందుకు… ఒక‌వేళ బ్యాంకు దివాళా తీస్తే మీకు అందించే ఆర్థిక స‌హాయం రూ.5 ల‌క్ష‌లు అందించ‌డానికి ఓ బిల్లు తీసుకొస్తున్నాం. మీ న‌గ‌దుకు మేం ర‌క్ష‌ణ అంటూ క‌ల్ల‌బొల్లి క‌బుర్లు చెబుతూ న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం ఓ బిల్లు తీసుకొస్తున్నారు. దానికి మ‌సిపూసి మారేడుకాయ‌ల‌గా ప్ర‌జ‌ల‌కు అందించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే ఈ విష‌య‌మై సోష‌ల్ మీడియాలో ర‌చ్చ‌ర‌చ్చ అవుతోంది.

ఇప్ప‌టి దాకా బ్యాంకుల‌కు ప్ర‌భుత్వం ద‌న్నుగా నిలుస్తోంది. బ్యాంకు క‌ష్టాల్లో ఉంటే ప్ర‌భుత్వాలు ఆదుకుంటున్నాయి. అయితే ఈ బిల్లుతో ప్ర‌భుత్వం బ్యాంకుల‌కు దూరంగా జ‌ర‌గ‌నుంది. బ్యాంకుకు క‌ష్టాలొస్తే ప్ర‌భుత్వం ప‌ట్టించుకోదు. ఆర్థిక క‌ష్టాలు ప్ర‌జ‌ల సొమ్ముతోనే ప‌రిష్క‌రించుకోవాలి. బ్యాంకులో ఉన్న ఖాతాదారుల సొమ్ముతో బ్యాంకు త‌న క‌ష్టాలు తీర్చుకోవాలి. దీనికోసం ఖాతాదారుల సొమ్మును య‌థేచ్చ‌గా వినియోగించొచ్చు. ఆ త‌ర్వాత క‌ష్టాలు తీర‌క‌పోతే దివాళా తీసే అవ‌కాశం ఉంది. ఈ క‌ష్టాలు వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌భుత్వం ఓ క‌మిటీని వేస్తుంది. ఆ క‌మిటీ ఏమి నివేదిక ఇస్తే దాన్ని ఫాలో కావాల్సి ఉంది. ఆ క‌మిటీ బ్యాంకును తీసేయ‌మంటే తీసేయాలి. ఒక‌వేళ బ్యాంకు దివాళా తీస్తే ఓ క‌మిటీ ఉంట‌ది. ఆ క‌మిటీ ఖాతాదారుడికి రూ.5 ల‌క్ష‌ల‌లోపు ఎంతైనా న‌గ‌దు ఇచ్చే అవ‌కాశం ఉంది.

ఈ విధంగా కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొస్తున్న ఫైనాన్షియల్ రెజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్స్యూరెన్స్ (ఎఫ్ఆర్డీఐ) బిల్లులో ఉండ‌నుంది. ఈ బిల్లు క‌నుక పార్ల‌మెంట్‌లో ఆమోదం పొంది చ‌ట్టంగా మారితే బ్యాంకులపై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం పోద్ది. వెంట‌నే బ్యాంకులు దివాళా తీసే స్థాయికి చేరి చివ‌రికి బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ దెబ్బ‌తినే ప్ర‌మాద‌క‌ర స్థాయికి చేరుకుంది. చివ‌రికి ప్ర‌భుత్వ బ్యాంకుల‌న్నీ దివాళా తీసి కేవ‌లం ప్రైవేటు బ్యాంకులు మిగిలేలా నరేంద్ర‌మోదీ ప్ర‌భుత్వం కంక‌ణం క‌ట్టుకొని కూసింది.

కొన్ని రోజులుగా ఒక న్యూస్ బాగా వైరల్ అవుతోంది. బ్యాంకులో డబ్బు ఉంటే భద్రంగా ఉంటుందని అందరు అనుకుంటారు. కానీ ఇప్పుడు ఒక న్యూస్ వల్ల చాలా మంది డబ్బును విత్ డ్రా చేసుకుంటున్నారు. ఫిక్సిడ్ డిపాజిట్ చేసిన వారు కూడా రూమర్స్ ని నమ్మి ముందే భయంతో డబ్బును వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంతకు ఆ కథ ఏంటనే వివరాల్లోకి వెళితే.. ఫైనాన్షియల్ రెజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్స్యూరెన్స్ (ఎఫ్ఆర్డీఐ) అనే బిల్లును నరేంద్ర మోడీ తెస్తున్నారని సామాన్య ప్రజల డబ్బు మొత్తం ప్రభుత్వం వాడుకుంటుందని సోషల్ మీడియాలో వార్తలు ఓ రేంజ్ లో వస్తున్నాయి.

ఈ భ‌యంతో సామాన్య, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. బ్యాంకులకు వ‌రుస క‌ట్టి గంట‌ల త‌ర‌బ‌డి నిలబడి మరీ త‌మ‌ డబ్బులు వెనక్కి తీసుకుంటున్నారు. బ్యాంక్ సిబ్బంది రూమర్స్‌లో నిజం లేదని ఎంత నచ్చజెప్పినా వినడం లేదు. ఈ ముచ్చ‌ట ఫేస్‌బుక్ వాట్సాప్ వంటి వాటిలో న్యూస్ వైరలవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -