Sunday, May 19, 2024
- Advertisement -

మహేష్ బాబు మాస్టర్ ప్లాన్ అదుర్స్ !

- Advertisement -

ఈ మధ్య కాలం లో బ్రహ్మోత్సవం సినిమా కి మంచి హైప్ రేగుతోంది. సినిమా పూర్తి క్లాస్ గా ఉండబోతోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల – మహేష్ – సమంత వీరి ముగ్గురి కాంబినేషన్ కావడం తో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చాలా బాగా సాగుతోంది. మహేష్ బాబు బ్రహ్మోత్సవం తో శ్రీమంతుడు తరవాత మరొక బ్లాక్ బస్టర్ అందుకోవాలి అని చూస్తున్నాడు. దానికోసం నిర్మాత అవతారం కూడా ఎత్తిన మహేష్ బాబు దీనికి ప్రమోషన్ భారీగా చెయ్యాలి అనే ప్లాన్ లో ఉన్నాడు.

శ్రీకాంత్ తో సినిమా కావడం తో క్లాస్ సినిమా నియా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు జనాలు. సో బిజినెస్ పరంగా మంచి రాబడి ఉండబోతోంది. దీనికి తగ్గట్టు టీవీ ల ద్వారా కూడా భారీ ప్రచారం చేసి ఈ చిత్రాన్ని ప్రమోట్ చెయ్యాలని చూస్తున్నారు. దానికోసం ఆడియో వేడుక ని బాగా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. మహేష్ స్వయంగా ఈ ఐడియా ని ఇచ్చాడట . ఆడియో వేడుకల మీద టీవీ లు ఎక్కువగా చూసే ఫామిలీ ఆడియన్స్ ఈ మధ్య దృష్టి పెట్టారు సో సాధ్యమైనన్ని ఎక్కువ చానల్స్ లో ఈ ఆడియో రావాలనేది వారి ప్లాన్ గా తెలుస్తోంది. 

ఈ సినిమా ఆడియో వేడుక కోసం 2 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్టు తెలుస్తోంది. దీంతో కేవలం ఆడియో వేడుకకే రెండు కోట్ల రూపాయలా..? అంటూ సినీజనం నోరెళ్ళ బెడుతున్నారు. ఇక బ్రహ్మోత్సవం ఆడియో వేడుకను తిరుపతిలో ఏప్రిల్ 23న జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ పాటలు ఎలా అలరిస్తాయో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -