Tuesday, May 21, 2024
- Advertisement -

30 ఇయర్స్ పృధ్వీ రాజమౌళి కీ కావాలట !

- Advertisement -

కృష్ణవంశీ ఖడ్గం సినిమాతో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ పృథ్వీ, గోపీచంద్ ‘లౌక్యం’ మూవీతో బాయిలింగ్ స్టార్ గా మాంచి బ్రేక్ అందుకున్నాడు. దాంతో ఇప్పుడు పృథ్వీకి క్రేజీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అంతేకాదు అతని కోసం స్పెషల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తున్నారు రచయితలు.

అయితే తాజాగా సౌఖ్యం సినిమాలో బాహుబలి స్పూఫ్ చేసి మెప్పించిన పృథ్వీకి, జక్కన్న నిజంగానే బాహుబలి-2 లో అవకాశం ఇవ్వబోతున్నట్టు సమాచారం. బాహుబలి పార్ట్-1లో వినోదానికి దూరంగా ఉన్న రాజమౌళి, బాహుబలి సీక్వెల్ లో కాస్త వినోదం జోడించబోతున్నాడట.

అందులోభాగంగా రీసెంట్ గా పృథ్వీ ‘బాహుబలి’ స్పూఫ్ చూసిన జక్కన్న, అతనితోనే కామెడీ చేయిస్తే బాగుంటుందనీ భావిస్తున్నాడట. దీంతో ఈ వార్తలో నిజముంటే పృథ్వీ పంట పండినట్టే అంటున్నారు సినీ జనాలు. బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవండతో పృథ్వీ దశ దిశ తిరగినట్టే అంటున్నారు. మరి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -