- Advertisement -

సంక్రాంతి రేసులో టాప్ హీరోల సినిమాలు

- Advertisement -

సంక్రాంతి కి తెలుగు హీరోలు తమ సినిమాలతో అభిమానులను అనందపరచనున్నారు. అయితే ఈ సంక్రాంతి రెస్‍లో నాలుగు సినిమాలు పోటి పడుతున్నాయి. అన్ని పెద్ద సినిమాలే కావడంతో సినిమాలపై అభిమానులో భారీగానే అంచనాలు ఉన్నాయి. మొదట ఈ సంక్రాంతికి నందమూరి హీరోల మధ్యే పోటి ఉంటుంది అనుకున్నారంతా.

కానీ వీరికి పోటీగా నాగార్జున, శర్వనంద్ పోటికి వస్తున్నారు. నందమూరి హీరో బాలకృష్ణ డిక్టేటర్ సినిమాతో వస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్, పాటలు అన్ని చూస్తుంటే కచ్చితంగా బాలయ్య హిట్ కొట్టేటటే ఉన్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో రాబోతున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం యుట్యూబ్‍లో సంచలనం సృష్టిస్తుంది. మొదటి నుంచే ఈ సినిమా పై ఎన్టీఆర్ అభిమానులో భారీగా అంచనాలు ఉన్నాయి.

ఎన్టీఆర్ స్టైలిష్ లూక్, సుకుమార్ డైరేక్షన్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక అక్కినేని అందగాడు నాగార్జున కూడా సంక్రాంతి భారీలో దిగుతున్నాడు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ పల్లెటూరి నేపథ్యం లో ఉండే కథతో వస్తున్నాడు. సినిమా ట్రైలర్ చూస్తుంటే ఈ సంక్రాంతికి నాగార్జునకి హిట్ వచ్చేటటే కనబడుతుంది.

ఇక శర్వానంద్ ‘ఎక్స్ ప్రెస్ రాజా’ గా రాబోతున్నాడు. మంచి సినిమాలు ఎంచుకుంటాడు అనే పేరు ఉంది శర్వానంద్‍కి. ఈ సారి మళ్ళీ హిట్ కొడుతా అంటున్నాడు ఈ హీరో. మరి ఈ నాలుగు సినిమాలో ఏ సినిమా హీట్ అవుతుందో ఏ సినిమా ప్లాప్ అవుతుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -