Thursday, May 16, 2024
- Advertisement -

వామ్మో.. ఆ హీరోయిన్ రెమ్యునరేషన్ ఐదు కోట్లా!

- Advertisement -

కాజోల్.. ఒకనాటి బాలీవుడ్ టాప్ హీరోయిన్! చాలా కాలం కిందటే పెళ్లి చేసుకొని గృహిణిగా స్థిరపడింది.

అయితే భర్త బాలీవుడ్ లోని ప్రముఖ నటుడు కావడంతో ఈమె హిందీ చిత్ర పరిశ్రమతో టచ్ లోనే ఉంది. ఇక ఒకనాటి క్రేజ్ కాజోల్ ను సినిమాల వైపు లాగుతూనే ఉంది! ఆ మధ్య ఆమిర్ ఖాన్ సినిమా ‘ఫనా’లో కాజోల్ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ‘మైనేమ్ ఈజ్ ఖాన్’ లోనూ నటించింది.

ఆ రెండు సినిమాలూ అంత సూపర్ హిట్స్ ఏమీకాకపోవడంతో కాజోల్ మిడిల్ డ్రాప్ అయ్యింది. సెకెండ్ ఇన్నింగ్స్ కొనసాగించలేకపోయింది. అయితే ఇలాంటి నేపథ్యంలో కూడా ఈ బెంగాలీ బ్యూటీకి క్రేజ్ తగ్గలేదని ఇప్పుడు స్పష్టం అవుతోంది! ఆమెను హీరోయిన్ గా నటింపజేయడానికి బాలీవుడ్ లోని ఆమె సన్నిహితులు తీవ్రంగా ప్రయత్నించారు. దీనికి ఆమె కూడా సమ్మతించడంతో ఆమె షారూక్ తో మళ్లీ జతకట్టబోతోంది.
‘దిల్ వాలే’ అనే సినిమాలో కాజోల్ షారూక్ తో నటించనుంది. దీనికి రోహిత్ షెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. వరుణ్ ధావన్ , కృతీ సనన్ లు కూడా ముఖ్యపాత్రల్లో చేయబోతున్నారు. మరి ఇప్పుడు కాజోల్ కు అందుతున్న పారితోషకమే అత్యంత పెద్ద విశేషం. ఏకంగా ఐదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోబోతోందట కాజోల్. ఇది ఇప్పుడు బాలీవుడ్ లో పిచ్చ ఫామ్ లో ఉన్న కరీనా, కత్రినా, దీపికా వంటి హీరోయిన్ల స్థాయి పారితోషకం. మరి ఏజైనా.. పెళ్లైన.. కాజోల్ కు ఈ స్థాయి పారితోషకం అంటే.. గొప్ప సంగతే కదా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -