Wednesday, May 22, 2024
- Advertisement -

తెలుగుదేశం దానిపై సమాధానం చెప్పలేకపోతోందా!

- Advertisement -

ఇంటర్నెట్లో లోకేష్ ఫోటోలకు తెగ షేరింగులు లభిస్తున్నాయి. మరి దీనికి తెలుగుదేశం పార్టీ ఆనందించేదే..

అయితే ఆ ఫోటోలు లోకేష్ కు నెగిటివ్ ఇమేజ్ ను తీసుకు వచ్చేవి. విదేశాల్లో ఉన్నప్పుడు లోకేష్  ఈతదుస్తుల్లో ఉన్న అమ్మాయిలతో దిగిన ఫోటో.. స్వయంగా ఈదుతున్న ఫోటోలు… చాలా చాలా సరదగా గడిపేసిన నాటి ఫోటోలు. మామూలు వాళ్లకు అయితే అవన్నీ ఎంజాయ్ మెంటే.. కానీలోకేష్ ఒక ముఖ్యమంత్రి తనయుడు.. తను కూడా భవిష్యత్తుకు ముఖ్యమంత్రి కావాలని భావిస్తున్నవ్యక్తి!

ఇక తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అయితే.. తన పెంపకం గురించి చాలా సర్టిఫికెట్లే ఇచ్చుకొంటూ ఉంటాడు. రాష్ట్ర అసెంబ్లీలో కూడా చంద్రబాబు తన పెంపకం గురించి గొప్పలు చెప్పుకొన్నారు! తన తనయుడు చాలా ప్రయోజకుడు.. విదేశాల్లో గొప్ప గొప్ప అంశాల గురించి అధ్యయనాలు చేసి వచ్చాడని బాబు ఎన్నికల ప్రచార సభల్లో కూడా చెప్పుకొన్నాడు. అయితే ఇప్పుడు ఫోటోలు మాత్రం లోకేష్ ఇమేజ్ ను డ్యామేజీ చేస్తున్నాయి!

మరి సాధారణంగా తెలుగుదేశం పార్టీ చిన్న పామును అయినా పెద్ద కర్రతో కొడుతుంది. తమకు ప్రమాదకరం అని భావిస్తే.. తెలుగుదేశం లో నేతలు అందరూ స్పందిస్తారు. అధినేత చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి అనర్గలంగా ఒక గంటన్నర సేపు మాట్లాడతారు. అయితే లోకేష్ ఫోటోల అంశం గురించి మాత్రం తెలుగుదేశం వైపు నుంచి స్పందన లేదు!

ఆ ఫోటోల్లో తప్పు ఏముంది? అని ప్రశ్నించేవాళ్లు కానీ, ఆ ఫోటోల్లో ఉన్నది లోకేష్ కాదు అని వాదించే వాళ్లు కానీ కనిపించలేదు! ఇలాంటినేపథ్యంలో.. ఆ ఫోటోల గురించి మాట్లాడటానికి తెలుగుదేశం పార్టీ భయపడుతోందేమో.. దాన్ని కెళకడం ఎందుకు.. తద్వారా ఇంకా చర్చ జరగనీయడం ఎందుకు.. సైలెంట్ గా ఉంటే సరిపోతుంది కదా.. అనే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టుగా ఉంది. మరి ఈ వ్యూహం మంచిదేనా?!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -