Thursday, May 23, 2024
- Advertisement -

పవన్ భజన తరవాత రిలీజ్ ఎప్పుడు ?

- Advertisement -

టాలీవుడ్ డైరెక్టర్ లకీ ప్రొడ్యూసర్ లకీ ఎప్పుడూ రిలీజ్ డేట్ ల విషయం లో గందర గోళం నడుస్తూనే ఉంటుంది. ఈ నేలలో రావాల్సిన బ్రహ్మోత్సవం , అ ఆ సినిమాలు రెండూ విడుదల విషయం లో మీమాంస లో పడిపోయాయి. ఆడియో వేడుకలో అయినా కనీసం క్లారిటీ ఇస్తారు అనుకుంటే హీరో నితిన్ కానీ త్రివిక్రమ్ కానీ పవన్ కళ్యాణ్ భజన చెయ్యడమే సరిపోయింది కానీ ఎక్కడా సినిమా విడుదల తేదీ గురించి పల్లెత్తు మాట అనలేదు.

బ్రహ్మోత్సవం ఎప్పుడు రిలీజవుతుందన్నదాన్ని బట్టి.. ‘అ..ఆ’ డేట్ ఖరారయ్యే అవకాశాలున్నాయి. బ్రహ్మోత్సవం మే 20 లేదా 27వ తేదీన రిలీజవుతుందని అంటున్నారు. ఐతే డేట్ విషయంలో క్లారిటీ లేదు. ఇంకా కొంచెం షూటింగ్ పెండింగ్ ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా 20న అంటే 13న లేదా 27న ‘అ..ఆ’ కన్ఫమ్ కావచ్చు.

బ్రహ్మోత్సవం 27న అయితే 13 లేదా 20న ‘అ..ఆ’ రావచ్చేమో. మరి బ్రహ్మోత్సవం సంగతేంటో మందు తేలాల్సి ఉంది. బహుశా మే 7న ఆడియో వేడుకలో బ్రహ్మోత్సవం విషయంలో క్లారిటీ వస్తుందేమో చూడాలి. నితిన్-సమంత జంటగా నటించిన ‘అ..ఆ’ను రాధాకృష్ణ నిర్మించాడు. మిక్కీజే మేయర్ సంగీతం అందించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -