Sunday, May 12, 2024
- Advertisement -

వామ్మో : కబాలి సినిమా 300 కోట్లు ?

- Advertisement -

‘కబాలి’ టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ చూశాక నిర్మాత కలైపులి థానుకు సినిమా మీద ఆశలు.. అంచనాలు భారీగానే పెరిగినట్లున్నాయి. ఈ సినిమా 300 కోట్లు వసూలు చేస్తుందని ఆయన బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు.

రజినీకాంత్ గత సినిమాలు విక్రమసింహా.. లింగా.. పెద్ద డిజాస్టర్లుగా నిలిచిన నేపథ్యంలో కబాలి మీద మొన్నటిదాకా పెద్దగా అంచనాలు లేవు. కానీ మే 1న ఫస్ట్ టీజర్ రిలీజవడం ఆలస్యం.. ఒక్కసారిగా ఈ సినిమా మీద అంచనాలు ఆకాశాన్నంటాయి. తెలుగు డబ్బింగ్ హక్కుల కోసం ఉన్నట్లుండి గట్టి పోటీ నెలకొంది.

తమిళంలో కూడా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం ఫ్యాన్సీ ఆఫర్లు ఇస్తున్నారు బయ్యర్లు. ఈ నేపథ్యంలో సినిమా మీద అంచనాలు మరింత పెంచేలా స్టేట్ మెంట్లు ఇచ్చాడు కలైపులి థాను.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -