Sunday, May 12, 2024
- Advertisement -

ఊపిరి చిత్రంతో హైట్రిక్ హిట్!

- Advertisement -

అక్కినేని నాగార్జున, కార్తీ, తమన్నా ఈ ముగ్గురి కాంబినేషన్‍లో వచ్చిన చిత్రం ఊపిరి. ప్రస్తుతం ఈ సినిమా రికార్డు సృష్టిస్తుంది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ సోంతం చేసుకొవడంతో మంచి కలక్షన్స్‌ వసులు చేస్తుంది. ఈ సినిమాకి సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు అందుతున్నాయి.

ఈ సినిమాకి వంశి పైడిపల్లి దర్శకత్వం వహించాడు. అయితే ఈ చిత్రం మొత్తానికి బాక్సాఫీస్ దగ్గర హాట్ సమ్మర్ లో బ్లాక్ బస్టర్ కూల్ హిట్ అని తేలిపోయింది. అయితే ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ ఒక్క హిట్ నాగార్జున తమన్నా కార్తీ దర్శకుడు వంశి లకు హైట్రిక్ హిట్ గా నిలిచింది. నాగార్జున ఇప్పటికే మనం సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలతో వరుస హిట్స్ అందుకున్నాడు.

తమన్నా బాహుబలి బెంగాల్ టైగర్ లతో వరుసహిట్స్ అందుకుంది. వంశి పైడిపల్లి బృందావనం ఎవడు చిత్రాలతో హిట్స్ అందుకున్నాడు. కార్తీ కి ఇది మొదటి స్ట్రైట్ తెలుగు సినిమా అయినప్పటికీ తమిళంలో మద్రాస్ ,కొమ్బాన్ లతో వరుస హిట్స్ కొట్టాడు. ఇప్పుడు తాజాగా ఈ నలుగురు కలిసి చేసిన ఈ ఊపిరి చిత్రంతో హైట్రిక్ హిట్ అందుకున్నారు. నిజంగా ఇది ఆశ్చర్య కర విషయంగా చెప్పుకోవచ్చు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -