Friday, May 17, 2024
- Advertisement -

పూర్తి కాని సినిమాకి జాతీయ అవార్డా?

- Advertisement -

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచదేశాలకు చాటి చెప్పిన బాహుబలి విదేశీ ప్రేక్షకులను సైతం విశేషంగా ఆకట్టుకుంది. రిలీజ్ అయిన నాటి నుండి రికార్డులు సాధించడమే కాదు ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకుంది బాహుబలి. అయితే ఇప్పుడు భారతదేశంలో సినిమాలకు గాను ఇచ్చే అత్యుత్తమ జాతీయ పురస్కారాన్ని కూడా కైవసం చేసుకుంది.

2015 సంవత్సరానికి గాను 63వ జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నసినిమాల ప్రకటనను జాతీయ అవార్డుల జ్యూరీ రిలీజ్ చేయడం జరిగింది. బాలీవుడ్ సినిమాలను కూడా కాదని బాహుబలి తన సత్తా చాటి ఉత్తమ చిత్రంగా జాతీయ చిత్రంగా అవార్డ్ కైవసం చేసుకుంది. దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కించిన విధంనం చాలా అద్భుతంగా ఉంది.

ఈ సినిమాకి జాతీయ అవర్డ్ రావడంతో బాహుబలి సినిమాలో నటించిన నటినటులతో పాటు సినీ పరిశ్రమ కూడా చాలా సంతోషంగా ఉంది.ఐతే ఈ సినిమా విజువల్స్ పరంగా అద్భుతంగా ఉన్న సినిమాలో చాలా వరకు మిస్టేక్స్ ఉన్న విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాలో కథ పరంగా కూడా అంత అద్భుతం అని చెప్పలేం.

ఇక బాహుబలి సినిమాకి సంబంధించి మొదటి భాగం మాత్రమే రిలీజ్ అయింది. ఇంక రెండో భాగం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సో అలంటప్పుడు ఈ సినిమాకి జాతీయ అవార్డ్ రావడంపై కొద్దరు తప్పుబడుతున్నారు. మరి బాహుబలి రెండో పార్ట్ వచ్చాక అది కూడా ఇదే విధంగా విజువల్స్ ఉంటే మరో జాతీయ అవార్డ్ ఇస్తారేమో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -