- Advertisement -

నటుడు ప్రకాశ్ రాజ్..ఇంట విషాదం

- Advertisement -

ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి సువర్ణలత కన్నుమూశారు. సువర్ణలత (86) గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం ఉదయం స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారు.

సువర్ణలత అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం బెంగళూరులో నిర్వహించనున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు ఆమెకు చివరి నివాళులు అర్పించనున్నారు.

ప్రకాశ్ రాజ్ తల్లిని కోల్పోవడం సినీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. సువర్ణలత మరణంతో ప్రకాశ్ రాజ్ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -