- Advertisement -
అనంతపురం జిల్లాలోని గుత్తి మండలంలో కుటుంబ సమస్యలు విషాదానికి దారితీసిన ఘటన చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ అందకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.మహాలక్ష్మి అనే మహిళ గత మూడు నెలలుగా గ్యాస్ సిలిండర్ లేకపోవడంతో కట్టెల పొయ్యిపైనే వంట చేస్తోంది. ఈ సమస్యపై భర్తతో తరచూ వివాదాలు జరుగుతున్నట్లు సమాచారం.
గ్యాస్ సిలిండర్ తీసుకురావడం లేదని భావించి తీవ్ర నిరాశకు గురైన మహాలక్ష్మి, ఫినాయిల్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.భర్త హరికృష్ణ మాట్లాడుతూ, గ్యాస్ సిలిండర్ కోసం వెళ్లినా దొరకలేదని తెలిపాడు. సరఫరా సమస్యల కారణంగా ఆలస్యమైందని చెప్పాడు.
ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
