Wednesday, May 22, 2024
- Advertisement -

శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు హీరో నాని పైనేనా…?

- Advertisement -

టాలీవుడ్ తాజా సంచ‌ల‌న తార శ్రీరెడ్డి మ‌రోసారి త‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలిచింది.టాలీవ‌డ్‌లో ఉన్న కాస్టింగ్‌ కౌచ్ గురించి పోరాడుతున‌ని చెప్పుకుంటున్న ఈ భామ తాజాగా ఫేస్‌బుక్‌లో మ‌రో పోస్ట్ చేసి మ‌ళ్లీ సంచ‌ల‌న‌ల‌కు తెర లెప్పింది.శ్రీరెడ్డి తాజాగా ఓ స్టార్‌ హీరోను టార్గెట్‌ చేసినట్టు కనిపిస్తోంది. సినీ తెరమీదే కాదు నిజజీవితంలోనూ ఆయన ‘నాచురల్‌’గా నటిస్తాడని, ఆయన ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడని శ్రీరెడ్డి ఆరోపించారు.రాంచరణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ నుంచి అతను నేర్చుకోవాల్సింది చాలా ఉందని, వారికి అహంభావం లేదని, కానీ అతనికి అహంకారం చాలా ఉందని పేర్కొన్నారు. దర్శకులను నువ్వు గౌరవించవు.

సక్సెస్‌ అయిన తర్వాత నీకు యాటిట్యూడ్‌ పెరిగిపోయింది. ఇటీవల నీకు కొడుకు పుట్టాడు, అంటూ శ్రీరెడ్డి పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌ అవుతోంది. ఈ కామెంట్స్‌ని చూస్తుంటే హీరో నాని ని అన్న‌ట్లు తెలుస్తుంది.మ‌రి దీనిపై నాని ఏవిధాంగా స్పందిస్తాడో చూడాలి.ప్ర‌స్తుతం నాని ఫ్యాన్స్ మాత్రం శ్రీరెడ్డిపై ఫైర్ అవుతున్నారు.మొన్నటికి మొన్న ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌పై కామెంట్ చేసిన శ్రీరెడ్డి త‌రువాత త‌న‌ని కాదు అని వివ‌ర‌ణ ఇచ్చుకుంది. మ‌రి దీనిపై యూట‌ర్న్ తీసుకుంటుందేమో చూడాలి.
ఈగ మూవీ గురించి ఇక్క‌డ మెన్ష‌న్ చేసింది.ఈగ ఈక‌లు ఊడిపోవాలి ఇండ‌స్ట్రీ నుండి అని స్ప‌ష్టంగా రాయ‌డంతో అంద‌రు హీరో నానినే అనుకుంటున్నారు.అంద‌రికి అర్థం అవ‌డంతో ఆ పోస్ట్‌ను ఎడిట్ చేసి మ‌ళ్లీ పోస్ట్ చేసింది.ఆ రెండు పోస్ట్‌ల‌ను ఈ క్రింద స్క్రీన్ షాట్‌ల ద్వారా చూడ‌వ‌చ్చు

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -