Friday, May 17, 2024
- Advertisement -

చుక్కలు చూపిస్తున్న విజయసాయి…. దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు

- Advertisement -

చంద్రబాబు బలం, బలగం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. తెలుగు నేల అంతటా కూడా బాబు మీడియాదే ఆధిపత్యం. పేరుకే మీడియా జనాలు కానీ టిడిపి కార్యకర్తలను మించి చంద్రబాబు కోసం కష్టపడుతుంటారు వాళ్ళు. జగన్‌ని ఎలా విమర్శించాలో? జగన్ విశ్వసనీయతను ఎలా దెబ్బతీయాలో టిడిపి అధినేతతో సహా అందరికీ ట్రైనింగ్ ఇచ్చేదే ఆ మీడియా జనాలు. చంద్రబాబుని విమర్శించిన ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్నే చీల్చి చెండాడిన జనాలు వాళ్ళు. ఇక న్యాయవ్యవస్థతో సహా అన్ని వ్యవస్థలనూ మేనేజ్ చేయగల సామర్థ్యం బాబు సొంతం అన్న విషయం అందరికీ తెలిసిందే.

అయితే అలాంటి చంద్రబాబుకు ఇప్పుడు నిద్రలేకుండా చేస్తున్నాడు విజయసాయిరెడ్డి. నారా లోకేష్ అవినీతి వ్యవహారాలను సాక్ష్యాలతో సహా వివరిస్తున్నాడు. విజయ్ మాల్యా నుంచి చంద్రబాబు ముడుపులు తీసుకున్న వైనం గురించి విజయసాయి వివరణ అయితే జాతీయ మీడియాలో కూడా హైలైట్ అయింది. ఇక తాజాగా రాజకీయాల కోసం చంద్రబాబు ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌ని వాడుకున్న వైనాన్ని సాక్ష్యాలతో సహా పట్టించాడు విజయసాయి. ఆ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ వ్యక్తితోనే…….‘నువ్వు మీడియా పర్సన్ కాదు….ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ అని నాకు తెలుసు……ఏమైనా కావాలంటే పర్సనల్‌గా కలువు…..వివరాలు ఇచ్చేస్తా……’ అని విజయసాయి అనడంతో అతనితో పాటు టిడిపి మీడియా జనాలకు కూడా దిమ్మతిరిగింది. ఇక ఢిల్లీలో బాబు డ్రామాలు, న్యాయమూర్తులను రహస్యంగా కలిసిన వైనం గురించి కూడా విజయసాయినే జాతీయ మీడియాకు వివరాలు అందించాడు. అలాగే కొన్ని గంటలపాటు ఎవ్వరికీ కనిపించకుండా చంద్రబాబు ఎస్కేప్ అయిన వైనంగురించి కూడా విజయసాయి సాక్ష్యాధారాలతో పట్టించాడు. చంద్రబాబు అండ్ కోకు షాకుల మీద షాకులు ఇచ్చాడు.

అందుకే ఇప్పుడు చంద్రబాబు అండ్ కో అందరూ కూడా విజయసాయినే టార్గెట్‌గా చేసుకున్నారు. జగన్ కంటే కూడా విజయసాయినే ఎక్కువ విమర్శిస్తున్నారు. టిడిపి భజన మీడియా అంతా కూడా ప్రతిరోజూ విజయసాయికి వ్యతిరేకంగా వార్తా కథలు వండి వారుస్తూ వస్తోంది. అయితే మొత్తం వ్యవహారాలను పరిశీలిస్తున్న జనాలకు మాత్రం చంద్రబాబు అండ్ కోకు విజయసాయి చుక్కలు చూపిస్తున్న వైనం మాత్రం కళ్ళకు కడుతోంది. ఈ విషయంపై వైకాపా శ్రేణులు అమితానందం వ్యక్తం చేస్తున్నారు. అయితే టిడిపి శ్రేణులు మాత్రం నిరుత్సాహపడుతున్నాయి. ప్రపంచానికి పాఠాలు చెప్పా, సీనియర్ మోస్ట్ నాయకుడిని, మేనేజ్‌మెంట్ కింగ్‌ని అని చెప్పుకునే చంద్రబాబు చివరికి విజయసాయి చేతిలో ఖంగు తింటున్న వైనం, విజయసాయి దెబ్బకు ఆందోళన చెందుతూ ఉండడం మాత్రం టిడిపి సీనియర్ నాయకులకు కూడా భవిష్యత్‌పై బెంగపట్టుకునేలా చేస్తోంది. చంద్రబాబు అండ్ కో వర్సెస్ విజయసాయిల యుద్ధం ఇంకా ఏ స్థాయికి చేరుకుంటుందో చూడాలి మరి. ప్రస్తుతానికి మాత్రం మొత్తం చంద్రబాబు అండ్ కో, చంద్రబాబు నెట్వర్క్‌పై విజయసాయిరెడ్డి పై చేయి సాధించిన వైనం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -