Monday, May 20, 2024
- Advertisement -

సునీల్ చేసిన తప్పే చేస్తున్నాడా?

- Advertisement -

సినీ పరిశ్రమలో క‌మెడియ‌న్లు హీరోల‌వ్వ‌డం సాధార‌ణ‌మైన విష‌య‌మే. అయితే హీరో అయిన తర్వాత హీరోయిజం చూపించి ప్రేక్షకులను ఆక‌ట్టుకోవ‌డం అంత ఈజీ కాదు. హీరో అంటే ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంటుంది దాని ముందుగా ఏర్ప‌ర‌చుకొని, సినిమాని హిట్ చేయడం మాములు విషయం కాదు. అయితే ఈ విషయంలో సునీల్ పర్వలేదు అనిపించాడు.

అందాల రాముడు, మ‌ర్యాద రామ‌న్న‌, పూల రంగ‌డు సినిమాలు చేసిన సునీల్ ను అభిమానులు అలరించాడు. ఆ తర్వాత సునీల్ చేసిన సినిమాలు పెద్దగా విజయం సొంతం చేసుకోలేకపోయాయి. సిక్స్ ప్యాకులు, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో వంటివి చేయడం వల్ల జనాలు మొహం తిప్పేసారు. ఆకారం కూడా మారడం వల్ల సునీల్ కి కొత్త సమస్యలు వచ్చాయి. నిజాన్నికి సునీల్ దగ్గరనుంచి అభినులు కోరుకుంటుంది ఫైటులు, డాన్సింగులు కాదు. ఎప్పట్టిలాగే సునీల్ నవ్వించే సినిమాలు చేయాలని ఆడియన్స్ ఫీలుతున్నారు.

కానీ ఈ విషయాన్ని సునీల్ పట్టించుకోవడం లేదు. ఇక్కడే సునీల్ సినిమాలు లెక్క తప్పుతున్నాయి. తాజాగా జ‌క్క‌న్న కూడా అలాంటి సినిమానే అనిపిస్తోంది. ఈ చిత్రంలో కూడా సునీల్ బాడీ పెంచి పైట్స్ చేస్తున్నాడు. దాంతో సునీల్ తాను చేసిన త‌ప్పే మ‌ళ్లీ రిపీట్ చేస్తున్నాడా అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ సారి కూడా సూనీల్ క‌మ‌ర్షియ‌ల్ హీరోగా రెచ్చిపోతే మాత్రం ఎదురు దెబ్బ తినక తప్పదు. మరి జ‌క్క‌న్న‌లో అదిరిపోయే కామెడీ ఉందో లేదో తెలియాలి అంటే మాత్రం సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -