Monday, May 5, 2025
- Advertisement -

రేవ్ పార్టీ..నటి హేమ అరెస్ట్!

- Advertisement -

బెంగళూరు రేవ్ పార్టీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖులతో పాటు సినీ రంగానికి చెందిన కొంతమంది ఉండటంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పోలీసులు.

ఇక ఈ ఎపిసోడ్‌లో హేమ పేరును బెంగళూరు పోలీసులు ప్రకటించారు.అంతేగాదు ఆమెకు నిర్వహించిన డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చిందని తేలింది. అయితే దీనిని హేమ ఖండించారు.పోలీసులు ఇచ్చిన నోటీసులను పట్టించుకోలేదు. దీంతో బెంగళూరు పోలీసులు హేమను అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీపై విచారించనున్నారు.

ఈ కేసులో మొత్తం 86 మందికి నోటీసులు ఇచ్చారు. ఈ రేవ్ పార్టీకి మొత్తం 150 మంది హాజరు కాగా, 105 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 86 మందికి డ్రగ్స్ టెస్టులో పాజిటివ్‌గా తేలింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -