Thursday, March 28, 2024
- Advertisement -

సూసైడ్ చేసుకోవాలని అనుకున్నా : ఖుష్బూ

- Advertisement -

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఇటీవల సూసైడ్ చేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. కొంత కాలంగా డిప్రెషన్ ఉన్న సుశాంత్ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని అతని ఫ్రెండ్స్ చెబుతున్నారు. అయితే కారణం ఏదైన ఆత్మహత్య చేసుకోవడం అనేది సొల్యూషన్ కాదని సుశాంత్ ఇలా చేసి ఉండకూడదు అని సెలబ్రీటీలు.. ఆయన ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల నటి ఖుష్బూ కూడా ఈ విషయాల పై స్పందించింది. నేను కూడా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవ్వడం వల్ల ఒక సమయంలో సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాను అంటూ ఖుష్బూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ…. “ప్రతి మనిషికి బాధ, ఒత్తిడి ఉంటాయి. ‘నాకు ఎలాంటి సమస్యలు లేవు’ అని చెబితే.. అది అబద్ధమే అవుతుంది. నేను కూడా మానసిక ఒత్తిడికి లోనయ్యాను. నా లైఫ్ కి ఇక గుడ్ బై చెప్పెయ్యాలి అనుకున్నాను.

అయితే తరువాత వాటితో పోరాడాలనే కసి నాలో ఏర్పడింది. నన్ను ఓడించాలని.. నన్ను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్న ఆ సమస్యల కంటే నేను బలమైన దాన్ని అని నిరూపించాలనుకున్నాను. నా ముగింపు కోసం ఎదురుచూస్తున్న వారిని ఓడించాలని కంకణం కట్టుకున్నాను. ఆ సమయంలో నా ఫ్రెండ్ నాకు ఎంతో సాయం చేసారు. నాకు పోరాడే శక్తి ఉండటం వల్లే ఈ రోజు ఇలా ఉండగలిగాను” అంటూ ఖుష్బూ చెప్పుకొచ్చింది.

శృంగారంలో స్వయంతృప్తి పొందే గృహిణిగా ఈషా..!

కడుపు చేయించుకుంది.. అంటూ పూనమ్ పై ఫైర్ అయిన శ్రీరెడ్డి..!

కుష్బూని ఇప్పుడు చూస్తే ఎవరైన షాక్ కావాల్సిందే..!

థమన్ కు ఎంత వయసు కొడుకున్నాడో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -