Thursday, May 9, 2024
- Advertisement -

‘అయ్యారే’ నిరాశ‌తో కోలీవుడ్‌కు ర‌కుల్‌ ప్రీత్‌సింగ్‌

- Advertisement -

టాలీవుడ్‌లో రాణించి ఆ త‌ర్వాత వ‌రుస ఫ్లాపులు రావ‌డంతో హిందీ బాలీవుడ్‌పై ఫోక‌స్ పెట్టిన ఆ అమ్మ‌డికి ‘అయ్యారే’ రూపేనా ఫ్లాపు ఎదుర‌య్యింది. ఇన్నాళ్లు ఆద‌రించిన ప‌రిశ్ర‌మ‌ను తిట్టి వెళ్లిన ఆ భామ మ‌ళ్లీ వెన‌క్కు వ‌చ్చేస్తోంది. ఆ హీరోయిన్నే రకుల్‌ప్రీత్‌ సింగ్‌. తెలుగుతోపాటు తమిళ సినిమాల్లో న‌టించిన ర‌కుల్ త‌ర్వాత హిందీలోకి వెళ్లింది. ఇప్పుడు మ‌ళ్లీ ద‌క్షిణాదిపై ఫోక‌స్ పెడుతోంది. ఇప్ప‌టికే తెలుగులో ఒక సినిమాకు ఒప్పుకోగా తమిళంలో మాత్రం ప‌లు సినిమాల్లో న‌టిస్తోంది.

ఇప్పుడు తమిళ స్టార్‌ శివ కార్తికేయన్‌ హీరోగా ఆర్‌. రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందే సినిమాలో ర‌కుల్‌ప్రీత్‌సింగ్ ఎంపిక‌య్యిన‌ట్లు తెలిపింది. ఫిక్షన్ నేప‌థ్యంలో ఈ సినిమా తీస్తు్నారు. త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవ‌కాశం ఉంది. గ‌తంలో కార్తీ ప‌క్క‌న రకుల్ ‘ఖాకీ’ సినిమా చేసి హిట్ కొట్టింది. రకుల్‌ ప్రస్తుతం హీరో సూర్య 36వ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పుడు బాలీవుడ్‌లో అజయ్‌ దేవగణ్ ప‌క్క‌న కూడా ఓ సినిమాలో న‌టిస్తోంది. త్వ‌ర‌లో కార్తీ న‌టించే మ‌రో సినిమాలో ర‌కుల్ ఎంపిక‌యిన‌ట్టు స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -