Thursday, May 9, 2024
- Advertisement -

త్రివిక్రమ్ చుట్టూ తిరుగుతున్న సూర్య – అఖిల్ – చిరంజీవి , ఎవరికి ఓకే అంటాడు ?

- Advertisement -

అఖిల్ సినిమా కి ఇచ్చినంత హైప్ ఈ మధ్య కాలంలో  ఏ సినిమాకీ చెయ్యలేదు . మాస్ సినిమాల దర్శకుడు వినాయక దర్సకత్వంలో వచ్చిన అఖిల్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా ఫెయిల్ అయ్యింది. అఖిల్ నటన విషయంలో మాత్రం బాగా మంచి పేరు వచ్చింది.

ఫైట్ ల నుంచి డైలాగ్ ల విషయంలో అఖిల్ చాలా బాగా చేసాడు అని టాక్ వచ్చింది  డాన్స్ ల విషయంలో అయితే చెప్పనక్కరలేదు .ఇప్పుడు అఖిల్ దెబ్బతిన్న పులిలా ఉన్నాడు, ఇలాంటి పరిస్థితి లో త్రివిక్రమ్ చేతిలో పడితే అఖిల్ కి తిరుగులేదు అని నాగార్జున ప్లాన్ .

ప్రస్తుతం’ అ ఆ ‘ సినిమా షూటింగ్ లో నితింగ్ తో బిజీ గా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ దీని తరవాత సూర్య తో సినిమా చేస్తాడని అందుకే చిరంజీవి సినిమా కూడా ఒద్దన్నాడు అని చెబుతుంటే. మరొక పక్క నాగార్జున మాత్రం తన కొడుకు రెండవ సినిమా కాస్త లేట్ అయినా కూడా త్రివిక్రమ్ తో నే తీయాలని చూస్తున్నాడు. అతడి కోసం ఎంతకాలమైనా వేచి చూస్తాడట. 

త్రివిక్రమ్ పై అఖిల్కి పూర్తి స్థాయిలో గురి ఉంది. నాగార్జునకి ఎంతో నమ్మకస్తుడు త్రివిక్రమ్. అసలు మొదటి సినిమానే త్రివిక్రమ్ తో అనుకున్నాడు కానీ అది కుదరలేదు. మొదటి చిత్రం మాస్ గా నిరూపించుకుని తరవాత త్రివిక్రమ్ చేతిలో పెట్టాలి అనుకున్నాడు. అఖిల్ – సూర్య – చిరంజీవి ల మధ్య ఎవరితో తీయాలో , ఎవరికి  గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలో తెలీక ఉండిపోయాడు త్రివిక్రమ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -